ఆ నలుగురు ఏం చేస్తున్నారు?

ఇప్పుడు నిజం చెప్పాలంటే.. వైసీపీ అధికారంలో ఉందే తప్ప ఆ పార్టీ పరిస్థిితి ఏమాత్రం బాగా లేదు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేకపోయినా పార్టీలో నెలకొన్న [more]

;

Update: 2020-11-02 13:30 GMT

ఇప్పుడు నిజం చెప్పాలంటే.. వైసీపీ అధికారంలో ఉందే తప్ప ఆ పార్టీ పరిస్థిితి ఏమాత్రం బాగా లేదు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేకపోయినా పార్టీలో నెలకొన్న విభేదాలు భవిష్యత్ లో ఇబ్బందులు తెచ్చిపెట్టేవే. ఏపీలో 151 నియోజకవర్గాల్లో వైసీపీ మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ఇప్పుడు దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో విభేదాలు నేతల మధ్య ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం పార్టీని పట్టించుకోవడం లేదు.

విభేదాల పరిష్కారానికి…..

విభేదాలను పరిష్కరించడానికి నలుగురు నమ్మకమైన నేతలను జగన్ నియమించుకున్నా వారి వల్ల కూడా కావడం లేదంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటంతో పార్టీలో నెలకొన్న విభేదాలను పరిష‌్కరించే బాధ్యతలను నలుగురికి అప్పగించారు. తాడేపల్లికి పంచాయతీకి రానవసరం లేకుండానే వీరు నలుగురు తమకు అప్పగించిన జిల్లాల్లో పర్యటించి పార్టీ నేతల మధ్య గ్యాప్ ను తొలగించాలన్నది జగన్ ప్రధాన ఉద్దేశ్యం.

నలుగురికి బాధ్యతలు…..

ఇందుకోసం విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను నియమించారు. నలుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వాళ్లే అని విమర్శలు వచ్చినా లెక్క చేయలేదు. తనకు నమ్మకమే ముఖ్యం కాబట్టి వారి చేతనే పని పూర్తి చేయించాలని జగన్ భావించారు. కానీ ఈ నలుగురి వల్ల కూడా కావడం లేదట. ఒక రకంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయసాయిరెడ్డి ఒక్కరే కొంత నేతల మధ్య విభేదాలను పరిష్కరిస్తున్నారని చెప్పాలి.

కొత్త సమస్యలతో…..

వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా ఉండటంతో ఆయన ఎక్కువగా అక్కడే ఉంటున్నారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొంత మృదుస్వభావి. ఆయన చేస్తున్న పంచాయతీలు ఒక కొలిక్కి రావడం లేదట. మరో నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి నుంచే ఆయన విభేదాలను పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ ఒక్క నియోజకవర్గంలో విభేదాలు పరిష్కారం కాకపోగా, కొత్త సమస్యలు వస్తున్నాయని తెలిసింది. వైసీపీ లోకి వచ్చిన నేతలు కూడా వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారు. మరి జగన్ నమ్మకంగా నలుగురికి అప్పగిస్తే వీరు ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది.

Tags:    

Similar News