తవ్వి తీసింది ఏంది….? పదిహేను నెలలవుతున్నా?
రాజధాని అమరావతిలో అవినీతి జరిగిందా? పెద్దయెత్తున అవినీతి జరిగితే జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదు. దీనికి కారణాలేంటి? జగన్ ప్రభుత్వం హడావిడి తప్ప [more]
;
రాజధాని అమరావతిలో అవినీతి జరిగిందా? పెద్దయెత్తున అవినీతి జరిగితే జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదు. దీనికి కారణాలేంటి? జగన్ ప్రభుత్వం హడావిడి తప్ప [more]
రాజధాని అమరావతిలో అవినీతి జరిగిందా? పెద్దయెత్తున అవినీతి జరిగితే జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదు. దీనికి కారణాలేంటి? జగన్ ప్రభుత్వం హడావిడి తప్ప అమరావతిలో అవినీతి అంటూ ఏమీలేదా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా విన్పిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో అవినీతిపై పదే పదే టీడీపీని ప్రశ్నిస్తున్న వైసీపీ అధికారంలో ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందన్న చర్చ సర్వత్రా జరుగుతుంది.
పెద్దయెత్తున అవినీతి జరిగిందని….
రాజధాని అమరావతిలో చంద్రబాబు సర్కార్ పెద్దయెత్తున అవినీతికి పాల్పడిందిన అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పదే పదే ఆరోపించారు. తన పాదయాత్రలో సయితం ఆయన ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఒక వర్గం వారే లబ్ది పొందారని కూడా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. చంద్రబాబు ఘోర ఓటమికి అనేక కారణాల్లో రాజధాని అమరావతిలో అవినీతి ఆరోపణలు కూడా ఒక కారణంగా చెప్పక తప్పదు.
మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఇచ్చినా….
అయితే ఇదే సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చీ రావడమే అమరావతి రాజధాని ప్రాంతంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని పునరుద్ఘాటించింది. అవినీతిని వెలికితీయడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. మంత్రి వర్గం ఉపసంఘం 4,050 ఎకరాలు బినామీ పేర్లతో టీడీపీ నేతలు స్వాహా చేసినట్లు నిర్ధారించింది. ఈ మేరకు అసెంబ్లీలో సయితం మంత్రి వర్గం ఉపసంఘం ఇచ్చిన నివేదికను బయటపెట్టారు.
అవినీతి జరిగితే చర్యలేవీ?
మంత్రివర్గం ఉప సంఘం ఇచ్చిన నివేదిక మేరకు ఏపీ సీఐడి రాజధాని భూముల వ్యవహారంపై విచారణ జరుపుతుంది. అధికారులు, కొందరు బీనామీ పేర్లతో కొనుగోలు చేసిన వారిని అదుపులోకి తీసుకుంది. తెల్ల రేషన్ కార్డు దారులు సయితం భూములను పొందారని ఆరోపించింది. దాదాపు 700 మంది వరకూ ఉన్నారని చెబుతోంది. ఇక టీడీపీ పెద్దల పేర్లను కూడా వెల్లడించింది. అయితే ఇప్పటి వరకూ ఎవరిపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా అవినీతిని నిర్ధారించకపోవడం అవి ఆరోపణలేనన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది.