‘ కమ్మ ‘ కబంధ హస్తాల నుంచి టీడీపీ బయట పడేనా ?
ఏపీ టీడీపీలో ఏం జరుగుతోంది ? నేతల మధ్య ఆధిపత్య ధోరణి కొనసాగుతోందా? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఏవిధంగా అయితే..ఆరోపణలు వచ్చాయో.. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. [more]
;
ఏపీ టీడీపీలో ఏం జరుగుతోంది ? నేతల మధ్య ఆధిపత్య ధోరణి కొనసాగుతోందా? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఏవిధంగా అయితే..ఆరోపణలు వచ్చాయో.. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. [more]
ఏపీ టీడీపీలో ఏం జరుగుతోంది ? నేతల మధ్య ఆధిపత్య ధోరణి కొనసాగుతోందా? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఏవిధంగా అయితే..ఆరోపణలు వచ్చాయో.. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. గత ఎన్నిక ల్లో చావుదెబ్బతిన్న తర్వాత కూడా .. ఎక్కడా మార్పు రాలేదని, రావడంలేదా ? అంటే.. ఔననే.. అంటున్నా రు పరిశీలకులు. గత ఎన్నికలకు ముందు.. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వైసీపీ అధినేత జగన్.. టీడీపీని టార్గెట్ చేస్తూ.. కమ్మ రాజ్యం.. కమ్మ రాజ్యం.. అంతా కమ్మ సామాజిక వర్గానిదే హవా.. మిగిలిన సామాజిక వర్గాలను ఎదగనివ్వడం లేదని.. విమర్శించేవారు.
విపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా…?
సరే.. ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా.. పోనీ అలా అన్నారని అనుకున్నా.. అప్పటికి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గుంటూరు వెస్ట్ నాయకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా ఇదే మాట వ్యాఖ్యానించారు.. కేవలం కమ్మ నేతలే హవా చలాయిస్తున్నారని.. పార్టీని వారే అధికారంలోకి తెచ్చారా? అంటూ.. కార్తీక భోజనాల కార్య క్రమంలో ఆయన నిలదీశారు. ఇక, పార్టీలోనూ కొందరు మౌనంగా ఇదే విషయాన్ని గుసగుసలాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక జగన్ సీఎం అయ్యాక కూడా కమ్మరావతి అంటూ అమరావతి ఒక కులానిదే అంటూ ఎత్తిచూపుతున్నారు. అయినా టీడీపీ నేతల్లో మార్పు రావడం లేదు.
వారి కనుసన్నల్లోనే…?
సరే.. అప్పుడంటే.. పార్టీ అధికారంలో ఉంది. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరుకదా.. గత 2019లో టీడీపీ చాలా దెబ్బతినింది కదా..! మరి మార్పేమైనా వచ్చిందా ? అని చూసుకుంటే.. ఎక్కడా కనిపించడం లేదు. కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆయా వర్గానికి చెందిన నేతల దూకుడు ఉంది.. మిగిలిన జిల్లాల్లో మాత్రం సామాజిక సమానత్వం పరిఢవిల్లుతోంది! అని చెప్పుకొనేందుకు ఎక్కడా అవకాశం లేకుండాపోయిందని అంటున్నారు తమ్ముళ్లు. పార్టీలో సామాజిక వర్గాల సమానత్వం పరిస్థితి మేడిపండు మాదిరిగా ఉందని అంటున్నారు. విశాఖ నుంచి చిత్తూరు వరకు కూడా కమ్మ వర్గానిదే పైచేయిగా ఉందని.. అందరూ వారి కనుసన్నల్లోనే పనిచేయాల్సి వస్తోందని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని చోట్లా వారిదే…?
ఫలితంగా.. టీడీపీలో సామాజిక వర్గాల అసమానతలపై అంర్గత చర్చ జోరందుకుంది. తమకు పదవులు ఇచ్చినా.. ప్రయోజనం లేదని.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ మంత్రి అనుచరులు గుసగు సలాడుతున్నారు. బీసీ సామాజిక వర్గాలు కూడా ఇలానే భావిస్తున్నాయి.. ఓటు బ్యాంకు కోసమే తాము.. పెత్తనానికి మాత్రం.. మా అధినేత వర్గం.. అంటూ.. వారు రుసరుసలాడుతున్నారు. ఇక, దిగువ శ్రేణి నేతల మధ్య కూడా సామాజికవర్గాల అంతరం కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో దీనిని సవరించకపోతే.. వచ్చే ఎన్నికల వరకు కూడా ఇలానే ఉండిపోతే.. పార్టీ మరోసారి తీవ్రంగా దెబ్బతినడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.