వైసీపీలో కాక రేపుతున్న రెండు స‌ర్క్యుల‌ర్లు

ఏపీలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య జోరు చ‌ర్చగా మారిన రెండు స‌ర్క్యుల‌ర్లు.. ఇటు నేత‌ల్లో గుబులుకు కూడా కార‌ణ‌మ‌య్యాయి. ఇటీవ‌ల జారీ అయిన ఈ రెండు [more]

;

Update: 2020-12-25 06:30 GMT

ఏపీలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య జోరు చ‌ర్చగా మారిన రెండు స‌ర్క్యుల‌ర్లు.. ఇటు నేత‌ల్లో గుబులుకు కూడా కార‌ణ‌మ‌య్యాయి. ఇటీవ‌ల జారీ అయిన ఈ రెండు స‌ర్క్యుల‌ర్లు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించేన‌ని ప్రచారం జ‌రుగుతోంది. వైసీపీలో కొన్నాళ్లుగా ప‌రిస్థితి గాడి త‌ప్పుతున్న విష‌యం తెలిసిందే. ఎవ‌రి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు వ్యవ‌హ‌రిస్తున్నారు. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. మంత్రులు ఆధిపత్య ధోర‌ణితో ముందుకు సాగుతున్నారు. ఫ‌లితంగా ప్రతిప‌క్షానికి ఆయుధాలు అందించిన‌ట్టు అయింది. ఇదిలావుంటే.. మ‌రికొంద‌రు నాయ‌కులు సైలెంట్‌గా ఉంటూ.. వైసీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించ‌డ‌మే మానేశారు.

ఆ కమిటీ పరిశీలన మేరకు….

ఇంకొంద‌రు.. ఈ దూకుడులో.. కులాల‌ను టార్గెట్ చేశారు. సామాజిక వ‌ర్గాల పేరు పెట్టి మ‌రీ తిడుతూ.. విరుచుకుప‌డ్డారు. ఇక ప‌లు జిల్లాల్లో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. దీంతో వైసీపీ నేత‌లు ఆశించిన స్థాయిలో గ్రాఫ్ పెంచుకోలేక పోతున్నార‌నేది పార్టీ గ్రహించింది. టీడీపీ సైలెంట్‌గా విస్తరిస్తోంద‌ని.. గ‌తంలో చంద్రబాబు.. ఏం చెప్పినా.. వినిపించుకోని కొన్ని వ‌ర్గాల ప్రజ‌లు ఇప్పుడు ఆస‌క్తిగా ఆయ‌న వైపు చూస్తున్నార‌ని వైసీపీకే స‌మాచారం ఉంది. దీనికి కార‌ణం ఏంటి ? ఎక్కడ త‌ప్పులు జ‌రుగుతున్నాయ‌నే విష‌యాల‌పై కొన్ని రోజుల కింద‌ట పార్టీ కీల‌క నేత‌ స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి, ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి, చెవిరెడ్డి భాస్కర‌రెడ్డిల‌తో కూడిన క‌మిటీని వేసింది.

జగన్ కు నివేదిక….

ఈ క‌మిటీ విస్తృత అధ్యయ‌నం చేసింది. అంతేకాదు ఎమ్మెల్యేల‌తో టెలీ కాన్ఫరెన్స్ కూడా పెట్టి వారి దూకుడును తెలుసుకుంది. ఈ నేప‌థ్యంలో ఈ త్రిస‌భ్య క‌మిటీ నివేదిక ఇటీవ‌ల జ‌గ‌న్‌కు అందించిన‌ట్టు తెలుస్తోంది. దీనిని ఆధారంగా చేసుకుని జ‌గ‌న్ రాజ‌కీయ స‌ల‌హాదారు.. స‌జ్ల రామ‌కృష్ణారెడ్డి రెండు స‌ర్క్యుల‌ర్లు జారీ చేశార‌ని స‌మాచారం. ప్రస్తుతం వీటిపై జిల్లా ఇంచార్జ్ మంత్రులు ఎమ్మెల్యేల‌కు క్లాసులు పీకుతున్నార‌ని తెలుస్తోంది. ఈ విష‌యం మీడియాకు వెల్లడికాకుండా జాగ్రత్తలు తీసుకునే బాధ్యత‌ను కూడా మంత్రుల‌కే అప్పగించార‌ని అంటున్నారు. మొత్తానికి ఈ రెండు స‌ర్క్యుల‌ర్ల ద్వారా.. వైసీపీ ఎమ్మెల్యేల దూకుడుకు బ్రేకులు వేయ‌డంతోపాటు.. పార్టీ ప‌రంగా ఎలా వ్యవ‌హ‌రించాల‌నే విష‌యంపై ఉన్నత స్థాయి నుంచి గైడ్‌లైన్స్ వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఇప్పటికైనా.. ఎమ్మెల్యేల్లో మార్పు క‌నిపిస్తుందా? చూడాలి.

Tags:    

Similar News