రెండేళ్లవుతున్నా ఇంకా వెయిటింగేనా?
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. పార్టీ కోసం కష్టపడిన వారు, కీలక సమయంలో పార్టీలోకి వచ్చిన వారు ఆశతో పదవుల కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. [more]
;
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. పార్టీ కోసం కష్టపడిన వారు, కీలక సమయంలో పార్టీలోకి వచ్చిన వారు ఆశతో పదవుల కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. [more]
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. పార్టీ కోసం కష్టపడిన వారు, కీలక సమయంలో పార్టీలోకి వచ్చిన వారు ఆశతో పదవుల కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. కానీ కనుచూపు మేరలో పదవుల భర్తీ కన్పించడం లేదు. వైసీపీ అధికారంలోకి రావడానికి పార్టీ అధినేత జగన్ పాదయాత్ర, ఆయనకున్న చరిష్మాతో పాటు అనేక మంది కీలక నేతల కృషి కూడా ఎంతో ఉంది. వీరంతా కష్టసమయంలో పార్టీకి అండగా నిలిచారు.
పదవుల భర్తీ కాక….
చివరకు పార్టీ అధికారంలోకి రావడంతో వీరు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎంతోమంది తమ టిక్కెట్లను కూడా త్యాగం చేసి పార్టీ పటిష్టతకు పనిచేశారు. 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వైసీపీకి హైప్ రావడానికి నేతల చేరిక కారణమని చెప్పాలి. వరసగా టీడీపీ, ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చి చేరడంతో టీడీపీకి బాగా డ్యామేజీ జరిగింది. అటువంటి వారిలో కిల్లి కృపారాణి, బుట్టారేణుక, ఎస్వీ మోహన్ రెడ్డి, దాడి వీరభద్రరావు, పండుల రవీంద్ర బాబు, సి.రామచంద్రయ్య వంటి నేతలున్నారు.
పార్టీ కోసం కష్టపడి…..
వీరంతా పార్టీ కోసం కష్టపడిన వారే. దాడి వీరభద్రరావు, కిల్లి కృపారాణి, సి.రామచంద్రయ్య వంటి నేతల రాకతో పార్టీకి బాగా కలసొచ్చిందనే చెప్పాలి. అయితే అధికారంలోకి రాగానే చల్లా రామకృష్ణారెడ్డి, పండుల రవీంద్ర బాబు వంటి వారికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. మిగిలని వారు పదవుల కోసం నిరీక్షిస్తున్నారు. రాజ్యసభ నాలుగు స్థానాలు ఖాళీ అయినా అవి వీరి దరి చేరలేదు. సి.రామచంద్రయ్య, కిల్లి కృపారాణి వంటి నేతలు రాజ్యసభ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో……
కానీ శాసనమండలి రద్దు ప్రతిపాదన చేయడంతో జగన్ మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు ఇవ్వాల్సి వచ్చింది. రాజ్యసభ స్థానాలు దక్కాలంటే వీరు మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. ఇక ఎమ్మెల్సీ పదవుల కోసం కూడా అనేక మంది కాచుకు కూర్చున్నారు. మర్రి రాజశేఖర్ లాంటి నేతలు తమ సీటును త్యాగం చేసి మరీ పార్టీ కోసం పనిచేశారు. శాసనమండలి రద్దయితే అది కూడా సాధ్యం కాదు. ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేస్తామంటున్న జగన్ వీరిలో కొందరికి అవకాశమిస్తారంటున్నారు. మొత్తం మీద రెండేళ్లు గడుస్తున్నా నేతలు మాత్రం ఎలాంటి పదవులు దక్కక నీరసంగానే ఉన్నారు.