ఉమ్మారెడ్డికి ఆ పదవి జగన్ రిజర్వ్ చేశారా?

వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు జగన్ కీలక పదవిని రిజర్వ్ చేశారు. ఈ మేరకు పార్టీలో బలంగా చర్చ జరుగుతోంది. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తొలి నుంచి [more]

Update: 2021-03-12 12:30 GMT

వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు జగన్ కీలక పదవిని రిజర్వ్ చేశారు. ఈ మేరకు పార్టీలో బలంగా చర్చ జరుగుతోంది. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తొలి నుంచి పార్టీలో ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి వైసీపీ లో చేరిన నాటి నుంచి జగన్ ఆయనకు ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. అధికారంలో లేకపోయినా ఎమ్మెల్సీని చేశారు. ఇక అధికారంలోకి రాగానే మంత్రి వర్గంలోకి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును తీసుకుంటారనుకున్నారు.

వయసు రీత్యా….?

కానీ వయసు రీత్యా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును జగన్ కేబినెట్ లోకి తీసుకోలేదంటారు. శాసనమండలిలో ఆయనకు ప్రతిపక్ష నేత హోదాను కట్టబెట్టారు. అయితే రాను రాను శాసనమండలిలో వాతావరణం వైసీపీకి అనుకూలంగా మారనుంది. తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు కొత్తగా వైసీపీ నుంచి ఎంపికవుతున్నారు. వీరంతా ఎమ్మెల్యే కోటా కావడంతో వారి ఎన్నిక లాంఛనమే. దీంతో శాసనమండిలో వైసీపీ బలం 16కు చేరుతుంది.

ఖాళీ అవుతున్న పదవులన్నీ….

ఇక జూన్ నాటికి మరో పద్ధెనిమిది మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ పద్దెనిమిది మంది కూడా వైసీపీకి చెందిన వారే ఎంపిక కానున్నారు. మొత్తం 58 మంది సభ్యులున్న మండలిలో వచ్చే జూన్ నాటికి వైసీపీదే పైచేయి అవుతుంది. ఇప్పటి వరకూ శాసనమండలిలో ప్రధాన పక్షంగా ఉన్న టీడీపీ విపక్షంలోకి వెళ్లనుంది. దీంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును శాసనమండలి ఛైర్మన్ గా ఎంపిక చేయాలని జగన్ భావిస్తున్నారు.

బలం పెరిగిన వెంటనే….

శాసనమండలిలో వైసీపీకి బలం రాగానే ప్రస్తుతమున్న మండలి ఛైర్మన్ షరీఫ్ తనంతట తానుగా రాజీనామా చేస్తారంటున్నారు. ఆ పదవిని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు. మరో సీనియర్ నేత సి.రామచంద్రయ్య కూడా మండలిలో అడుగుపెడుతుండటంతో ఆయనకు కూడా ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతో జగన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకే మండలి ఛైర్మన్ పదవిని ఖాయం చేశారన్న ప్రచారం పార్టీలో జరుగుతుంది.

Tags:    

Similar News