యోగికి అలా చెక్ పెడుతున్నారట

ఎన్నికల వేళ ఎన్నో ప్రచారాలు వస్తుంటాయి. అవి అధికారంలో ఉన్న పార్టీకి ఇబ్బందిగా మారుతుంటాయి. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కు అటువంటి సెగ [more]

Update: 2021-02-04 16:30 GMT

ఎన్నికల వేళ ఎన్నో ప్రచారాలు వస్తుంటాయి. అవి అధికారంలో ఉన్న పార్టీకి ఇబ్బందిగా మారుతుంటాయి. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కు అటువంటి సెగ తగులుతున్నట్లే ఉంది. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో ఎవరు జెండా ఎగురవేస్తే వారే ఢిల్లీ పీఠమెక్కుతారన్నది సెంటిమెంట్ గా వస్తుంది. అందుకే అన్ని పార్టీలు ఉత్తర్ ప్రదేశ్ పైనే ఎక్కువ దృష్టి పెడతాయి. అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు. కానీ పార్లమెంటు ఎన్నికలు కావచ్చు దేశం దృష్టి మొత్తం ఉత్తర్ ప్రదేశ్ పైనే ఉంటుంది.

అతి పెద్ద రాష్ట్రమైన…..

అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో 75 జిల్లాలున్నాయి. 80 పార్లమెంటు స్థానాలున్నాయి. 403 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ రాష్ట్ర విభజన. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విడగొడతారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. చిన్న రాష్ట్రాలకు బీజేపీకి ఎటూ అనుకూలమే కాబట్టి వచ్చే ఎన్నికలకంటే ముందు ఉత్తర్ ప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలని బీజేపీ భావిస్తుందని చెబుతున్నారు.

నాలుగు రాష్ట్రాలుగా….

గతంలోనూ మాయావతి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ప్రతిపాదన వచ్చింది. 2011లో మాయావతి తాను అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదనను తెచ్చినట్లు బీజేపీ నేతలు గుర్తించారు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ గా విడగొట్టారు. 2000 సంవత్సరంలో వాజపేయి హయాంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి బుందేల్ ఖండ్, పూర్వాంచల్, అవద్ ప్రదేశ్, హరిత ప్రదేశ్ గా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది.

డిమాండ్ ఎప్పటి నుంచో?

నిజానికి బుందేల్ ఖండ్, పూర్వాంచల్ రాష్ట్రాల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. రాష్ట్ర విభజన జరగదని, ఉత్తర్ ప్రదేశ్ చరిత్రను తాము తొలగించేది లేదని ఆయన చెబుతున్నారు. అయితే ఎన్నికల వేళ మాత్రం ఈ ప్రచారం అధికార బీజేపీని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. మరో రెండేళ్లలో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News