అచ్చెన్న ప్రభావంతో ఫుల్ సైలెంట్…?
చంద్రబాబు ఆశలన్నీ తమ్ముళ్ళే అంటారు. ఆయన తాన అంటే తందానా అని తమ్ముళ్ళు అనాల్సిందే. ఆ మాటకు వస్తే ఏ నాయకుడికైనా ఇదే జరగాలి. అపుడే పార్టీ [more]
చంద్రబాబు ఆశలన్నీ తమ్ముళ్ళే అంటారు. ఆయన తాన అంటే తందానా అని తమ్ముళ్ళు అనాల్సిందే. ఆ మాటకు వస్తే ఏ నాయకుడికైనా ఇదే జరగాలి. అపుడే పార్టీ [more]
చంద్రబాబు ఆశలన్నీ తమ్ముళ్ళే అంటారు. ఆయన తాన అంటే తందానా అని తమ్ముళ్ళు అనాల్సిందే. ఆ మాటకు వస్తే ఏ నాయకుడికైనా ఇదే జరగాలి. అపుడే పార్టీ నడుస్తుంది. ఉత్తముల్లోకెల్ల పరమోత్తములు ఉత్తరాంధ్రా తమ్ముళ్ళు అని చంద్రబాబు తెగ మురిసిపోయేవారు. కానీ ఇపుడు వారు తాము బుద్దిమంతులైన గౌతమ బుద్ధులం అని కూడా చెబుతున్నారుట. అంటే ముక్కుమూసుకుని మౌనమే మా భాష అంటున్నారుట. అచ్చెన్నాయుడు ఎఫెక్ట్ బాగా కొట్టిందని, అందుకే తమ్ముళ్ల సైలెంట్ అయ్యారని టాక్ నడుస్తోంది.
కూన రాగాలేవీ ….
అచ్చెన్న బిగ్ ఫిగర్ తో పక్కనుంటే ఉంటే చాలు కూన రవికుమార్ చేసిన గర్జనలు అలా ఇలా ఉండేవి కావుగా. ఆయన అధికార పార్టీకే అన్నయ్యను అన్నట్లుగా మంత్రులను, అధికారులను సైతం విడిచిపెట్టకుండా రెచ్చిపోయేవారు. ఆయన నోటికి అడ్డూ అదుపూ లేకుండా దూషణ పర్వానికి తెర తీసేవారు. నిజానికి శ్రీకాకుళం జిల్లాలో రెండు సీట్లు తప్ప అన్నీ ఊడ్చేసిన వైసీపీకి కూన రవికుమార్ ఎక్కడా కొరుకుడుపడలేదంటే నమ్మాలి. ఆయనేనా అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నట్లుగా హవా చలాయించేవారు. ఇపుడు మాత్రం కూని రాగాలు కూడా ఎక్కడా లేకుండా పోయాయి. గప్ చిప్ అన్నట్లుగా ఎవరికి వారు సర్దుకున్నారు. కారణం అచ్చెన్న రెండున్నర నెలలుగా అయిపూ అజా లేకపోవడమే.
నిర్భయమేదీ…?
ఇక విశాఖ జిల్లా విషయానికే వస్తే నిర్భయ యాక్ట్ ప్రకారం ఆరున్నర పదులు వయసున్న అయ్యన్నపాత్రుడి మీద కేసును పోలీసులు ఫైల్ చేశారు. అంతే ఆ తరువాత అయ్యన్నలో భయం ఆవహించిందని అంటున్నారు. ఎపుడూ తెగ హడావుడి చేసే అయ్యన్నపాత్రుడు ఇపుడు సైలెంట్ అయిపోయారు. అపుడపుడు మాత్రం ఆయన వీడియో క్లిప్స్ ని మీడియాకు పంపిస్తూ మొక్కుబడిగా వైసీపీ సర్కార్ని విమర్శిస్తున్నారు. ఇదివరకూ జోష్ పెద్దాయనతో అసలు లేదని తమ్ముళ్లే ఆశ్చర్యపోతున్నారుట. నిర్భయంగా ఉండాల్సిన మాజీమంత్రికి ఇంత భయమెపుడు పట్టుకుందని నోళ్ళు నొక్కుకుంటున్నారుట.
ఈయనా అంతేగా…
విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. ఆయన ఆ మధ్య దాకా అయిన దానికీ కానిదానికీ వైసీపీ మీద జగన్ మీద గట్టిగానే తగులుకునేవారు. ఇపుడు ఆయన వైఖరిలోనూ మార్పు వచ్చేసింది. పైగా విశాఖ రాజధాని కావడంతో ఆయన మీడియా ముందుకు వచ్చి ఎటూ చెప్పలేని స్థితిలో పడ్డారు. ఈ పరిణామాల నేపధ్యంలో తప్పించుకుని తిరిగేవాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా టైం పాస్ చేస్తున్నారు. ఇక అచ్చెన్న అరెస్ట్ అన్నది ఎంత పకడ్బంధీగా చేశారో ఇపుడిపుడే తమ్ముళ్లకు అర్ధమవుతోంది. కనీసం బెయిల్ మీద బయటకు రానీయకుండా అచ్చెన్న సీన్ ఉందని తెలుసుకున్న తమ్ముళ్లకు నోట మాట రావడం లేదు. అందుకే కాని కాలంలోనూ, కరోనా కాలంలోనూ కాలు బయటపెడితే కాలిపోతుందని గ్రహించే కామ్ గా ఉంటున్నారుట.