Vamsi : వంశీ ఛాలెంజ్ కు నో రెస్పాన్స్.. రీజన్ ఇదేనా?

గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఛాలెంజ్ లు విసురుతున్నారు. రాజీనామా పత్రాన్ని రాసుకోవాలంటూ టీడీపీ [more]

;

Update: 2021-10-25 08:00 GMT

గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఛాలెంజ్ లు విసురుతున్నారు. రాజీనామా పత్రాన్ని రాసుకోవాలంటూ టీడీపీ నేతలకు ఖాళీ లెటర్ ప్యాడ్ ఇచ్చి మరీ సవాల్ విసురుతున్నారు. వల్లభనేని వంశీ సవాల్ కు టీడీపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీనికి కారణం అక్కడ సరైన నేత లేకపోవడమేనన్నది ప్రధాన కారణం. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నిలదొక్కుకోవాలంటే మరికొంత సమయం పట్టే అవకాశముంది.

వ్యక్తిగత విమర్శలు…

వల్లభనేని వంశీ వరసగా రెండు సార్లు గన్నవరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అదీ తెలుగుదేశం పార్టీ గుర్తు మీదనే. గత ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన వైసీపీకి మద్దతుదారుగా మారిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి ఇబ్బంది ఎదురయినప్పుడల్లా చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగత విమర్శలకు సయితం దిగుతున్నారు. అయినా టీడీపీ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.

వారే ఎక్కువ సార్లు….

గన్నవరం నియోజకవర్గంలో సామాజికవర్గాల సమీకరణను చూసుకున్నా టీడీపీ బలంగా ఉంది. ఇక్కడ కమ్మ సామాజికవర్గం ఆధిపత్యం ఉంది. ఈ నియోజకవర్గంలో ఐదు సార్లు టీడీపీ గెలిచింది. ఇకసారి ఇండిపెండెంట్ గా గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. ఆయన టీడీపీ మద్దతుదారే. బీసీకి చెందిన వారు కూడా ఇక్కడ నుంచి ఎన్నికైనా కమ్మ సామాజికవర్గం నేతలే ఎక్కువ సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వల్లభనేని వంశీ సవాల్ కు టీడీపీ స్పందించకపోవాడానికి ప్రధాన కారణం అక్కడ పార్టీ మరింత బలహీనంగా మారిపోవడమే.

మరింత బలపడేంత వరకూ…..

వల్లభనేని వంశీ పార్టీ ని వీడిన తర్వాత అక్కడ చాలా కాలం ఇన్ ఛార్జిని కూడా చంద్రబాబు నియమించలేదు. చాన్నాళ్ల తర్వాత అక్కడ బీసీ నేత బచ్చుల అర్జునుడును నియమించారు. కాన ఆయనకు అక్కడ పట్టు లేదు. తన సామాజికవర్గం తనకు అండగా నిలుస్తుందని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని వల్లభనేని వంశీకి ఉన్న ధీమానే ఈ సవాల్ కు కారణమని తెలుస్తోంది. ఉప ఎన్నిక కంటే సాధారణ ఎన్నికలలోనే వంశీని ఎదుర్కొనాలన్నది టీడీపీ ఆలోచన. అందుకే వంశీ ఎన్ని మాటలు అంటున్నా అది టీడీపీ బలోపేతానికి ఉపయోగపడుతుందన్న అంచనాలో నేతలు ఉన్నారు.

Tags:    

Similar News