రాజే తో ఇబ్బందులు తప్పేలా లేవు
రాజస్థాన్ రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ భారతీయ జనతా పార్టీకి పార్టీ నేతలు తలనొప్పిగా మారారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం [more]
రాజస్థాన్ రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ భారతీయ జనతా పార్టీకి పార్టీ నేతలు తలనొప్పిగా మారారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం [more]
రాజస్థాన్ రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ భారతీయ జనతా పార్టీకి పార్టీ నేతలు తలనొప్పిగా మారారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతున్నారు. వచ్చే ఎన్నికలకు తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సిందేనంటూ వసుంధర రాజే వత్తిడి తెస్తున్నారు. వసుంధర రాజే వెంట అధికసంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండటంతో పార్టీకి తలనొప్పిగా మారింది.
పార్టీ చీఫ్ తో….
రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పునియాకు, వసుంధర రాజేకు మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. రాష్ట్ర కార్యవర్గంలోనూ తన వర్గానికి చోటు కల్పించలేదని రాజమాత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే నెలల నుంచి వసుంధర రాజే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దాదాపు మూడు నెలల పాటు వసుంధర రాజే ఢిల్లీకే పరిమితమయ్యారు. పది రోజుల క్రితమే ఆమె రాజస్థాన్ కు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా…..
రాజస్థాన్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ వసుంధర రాజే వర్గం నుంచి అధిష్టానంపై వత్తిడి తెస్తున్నారు. ఆమె వెంట దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా వసుంధర రాజేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 2023లో రాజస్థాన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరడంపై పార్టీలో అభ్యంతరం వ్యక్తమవుతోంది.
బలమైన సంకేతాలే…..
తనను కాదని ముందుకు వెళ్లలేరని వసుంధర రాజే సంకేతాలిచ్చారు. ఇప్పటికే రైతుల్లో కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తితో ఉంది. రాజస్థాన్ లో ఈ ఎఫెక్ట్ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ అధిష్టానం వసుంధర రాజే డిమాండ్ కు తలొగ్గక తప్పదనే తెలుస్తోంది. అయితే ఆమె వయసు రీత్యా పదవి అప్పగించే అవకాశాలు లేవంటున్నారు. మొత్తం మీద వసుంధర రాజే వ్యవహారం రాజస్థాన్ లో బీజేపీకి తలనొప్పిగా మారింది.