ఆడిటర్ కు రాజకీయం ఏం తెలుసులే అనుకుంటే?

వైసీపీలో ఎంతో మంది సీనియ‌ర్ నాయ‌కులు ఉన్నప్పటికీ.. ఎప్పటిక‌ప్పుడు మీడియాలో సెంట‌రాఫ్ ది టాపి క్‌గా నిలిచేది మాత్రం విజ‌య‌సాయిరెడ్డి. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. [more]

Update: 2020-04-28 08:00 GMT

వైసీపీలో ఎంతో మంది సీనియ‌ర్ నాయ‌కులు ఉన్నప్పటికీ.. ఎప్పటిక‌ప్పుడు మీడియాలో సెంట‌రాఫ్ ది టాపి క్‌గా నిలిచేది మాత్రం విజ‌య‌సాయిరెడ్డి. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. ఇటు రాష్ట్ర రాజ‌కీయాల్లోను, అటు జాతీయ రాజ‌కీయాల్లోనూ వైసీపీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్తున్న వారు చాలా మంది ఉన్పప్పటికీ.. విజయ సాయిరెడ్డి మాత్రం ఎప్పుడూ ఫ‌స్టే ఉంటున్నారు. పార్టీ ప్రధాన కార్యద‌ర్శిగా.. రాజ్యస‌భ స‌భ్యుడిగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సాయిరెడ్డికి కీల‌క‌మైన బాధ్యత‌లు అప్పగించారు. ఈ క్రమంలోనే పార్టీ పార్లమెంట‌రీ పార్టీ నేత‌గా కూడా ఆయ‌న వ్యవ‌హ‌రిస్తున్నారు.

జగన్ అంచనాలను…..

అటు లోక్‌స‌భ‌, ఇటు రాజ్యస‌భ స‌భ్యుల‌కు ఆయ‌నే దిక్సూచి. నిజానికి ఆడిట‌ర్‌గా వ్యవ‌హ‌రించిన విజయ సాయిరెడ్డికి ఆదిలో రాజ‌కీయాలు ఏం తెలుస్తాయ‌ని అంద‌రూ పెద‌వి విరిచారు. ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు స‌హా ఎన్నిక‌ల‌కు ముందు ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్‌గా ఆయ‌న‌ను నియ‌మించిన‌ప్పుడు కూడా వైసీపీ అధినే త జ‌గ‌న్ రాంగ్ స్టెప్ వేస్తున్నార‌ని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, అన‌తి కాలంలో ఈ పెద‌విరుపులు మాయ‌మ‌య్యేలా వ్యవ‌హ‌రించి, ముక్కున వేలేసుకునేలా త‌న‌ప‌నితీరు క‌న‌బ‌రిచారు విజయ సాయిరెడ్డి. ప్రతి ఒక్కరితోనూ ఆయ‌న వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తూ ముందుకు సాగారు.

జాతీయ రాజకీయాల్లోనూ…..

మ‌రీ ముఖ్యంగా జాతీయ రాజ‌కీయాల్లో అప్పటి వ‌ర‌కు టీడీపీకి ఉన్న సానుకూల వైఖ‌రి.. దూకుడు, ప‌రిచ‌యాలు వంటివి భారీగా ఉండేవి. దీనిని అందిపుచ్చుకునే ప్రాంతీయ పార్టీ ఏపీలో ఉందా ? అని అప్పటి వ‌ర‌కు అనుకున్నారు. అయితే, ఈ గ్యాప్‌ను, లోటును విజయ సాయిరెడ్డి అధిగ‌మించారు. ఢిల్లీలో కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు. ప్రధాని మోడీ, బీజేపీ అప్పటి సార‌ధి అమిత్ షాల‌ను త‌న‌దైన చాతుర్యంతో ఆక‌ట్టుకున్నా రు. టీడీపీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీకి ప్రధాని మోడీ అప్పట్లో అప్పాయింట్ మెంట్ ఇవ్వక‌పోయినా.. విజయ సాయిరెడ్డి మాత్రం వారానికి ఒక‌సారి మోడీతో భేటీ అయ్యేవారు.

విపక్షాలకు ధీటుగా…..

ఈ విధ‌మైన వాతావ‌ర‌ణం.. ఎన్నిక‌ల‌కుముందు పార్టీకి ఎంత‌గానో ఉప‌క‌రించింది. ఇక‌, ఉత్తరాంధ్ర స‌హా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న నిర్వహించిన పాత్ర కార‌ణంగా.. పార్టీకి మంచి బూమ్ వ‌చ్చింది. ఇక‌, పార్టీ అధికారంలోకి వ‌చ్చాక కూడా సీఎంగా జ‌గ‌న్ ఢిల్లీ ప్రయాణం అయితే, దానికి క‌ర్త క‌ర్మ క్రియ‌గా విజయ సాయిరెడ్డే వ్యవ‌హ‌రించారు. ఇక‌, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయ‌కుల‌కు ఎప్పటికప్పుడు కౌంట‌ర్లు ఇవ్వడంలోను, విమ‌ర్శలు చేయ‌డంలోను విజయ సాయిరెడ్డి ముందుంటున్నారు. తాజాగా క‌రోనా టెస్టింగ్ కిట్ల విష‌యంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చేసిన విమ‌ర్శల‌కు సాయిరెడ్డి ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో కౌంట‌ర్లు ఇచ్చారు.

సోషల్ మీడియాలోనూ…..

ఈ వివాదం ఎంత‌దూర‌మైనా ఫ‌ర్వాలేద‌నే రేంజ్‌లో విజయసాయిరెడ్డి వ్యవ‌హ‌రించారు. అటు సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ టీడీపీ నేత‌ల‌ను, జ‌న‌సేన నేత‌ల‌ను.. అటు బీజేపీ వాళ్లను ఉతికి వాయించేస్తున్నారు. ఇక వైసీపీలో ఆయ‌న మంత్రి కాకుండానే మంత్రుల‌ను మించిన శ‌క్తిగా మారి అన్ని చ‌క్కపెడుతున్నారు. మొత్తానికి ఈ ప‌రిస్థితి వైసీపీలో మ‌రే నాయ‌కుడికి లేదంటే అతిశ‌యోక్తి కాదు. అందుకే విజయసాయిరెడ్డి జగన్ కంటే విపక్షాలకు టార్గెట్ అయ్యారు.

Tags:    

Similar News