విజయసాయి రెడ్డి సీన్ ముగిసిందా …?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే విజయసాయి రెడ్డి అనేంత ఇదిగా వైసిపి లో రాజకీయాలు నడిచాయి. అది నిన్నటి మాట గా మారిందా ? అంటే [more]

Update: 2020-06-28 03:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే విజయసాయి రెడ్డి అనేంత ఇదిగా వైసిపి లో రాజకీయాలు నడిచాయి. అది నిన్నటి మాట గా మారిందా ? అంటే అవుననే అంటున్నారు వైసిపి శ్రేణులు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ప్లేస్ ను సజ్జల రామకృష్ణ రెడ్డి భర్తీ చేశారని అంటున్నారు అంతా. అందువల్లే జగన్ ను కలిసిన వెంటనే సజ్జల దర్శనానికి నేతలు క్యూ కడుతున్నారట. ఇది ముఖ్యనేతలతో జగన్ భేటీ అవుతున్న తరువాత జరుగుతున్న పరిణామం.

ఎల్జీ పాలిమర్స్ తరువాత …

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగిన వెంటనే జగన్ హుటాహుటిన సంఘటన స్థలానికి బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయనతో బాటు విజయసాయి రెడ్డి కూడా కారెక్కారు. ఏమైందో ఏమిటో తెలియదు కానీ విజయసాయి ని జగన్ సిఎం ఇంటివద్దే దించేశారు. ఆ వీడియో ను సిఎం నివాసం నుంచే మీడియా కు షేర్ చేశారు వైసిపి సమాచార విభాగం. ఆ సంఘటన తోనే మీడియా లో విజయసాయి రెడ్డి అధికారాలకు జగన్ కత్తెర వేశారని ఎల్లో మీడియా లో స్టోరీలు వచ్చాయి కూడా. దాన్ని విజయసాయి రెడ్డి ఖండించారు కూడా. తనకు జగన్ కి మధ్య అగాధం సృష్ట్టించేందుకే ఇదంతా చంద్రబాబు మీడియా గా ఆయన కొట్టిపారేశారు.

రఘురామ కృష్ణం రాజు ఎపిసోడ్ తరువాత …

ముఖ్యమంత్రి జగన్ ను ఎవరు కలవాలనుకున్నా ముందుగా విజయసాయి రెడ్డి ని ప్రసన్నం చేసుకోవాలి. విజయసాయి మాత్రమే ముఖ్యమంత్రి తో సదరు నేత కలవాలో లేదో డిసైడ్ చేస్తారు. ఇది ఇప్పటివరకు ఉన్న సీన్. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి పై ఆరోపణలు ముప్పిరిగొంటున్నాయి. నేతలకు జగన్ ను దూరం చేస్తున్నారనే ఆరోపణలు రఘురామ కృష్ణం రాజు వంటివారు తీవ్రం చేశారు. అయితే రాజు ఆరోపణలకు ముందే జగన్ తన కోటరీ ని ప్రక్షాళన చేసేసారు. సజ్జల కు విజయసాయి రెడ్డి ప్లేస్ కేటాయించారని అంటున్నారు. దాంతో అంతా ఇప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితులను జగన్ కి వివరించడంతో బాటు అధినేత తో సన్నిహితంగా ఉండే ఛాన్స్ దొరికిందన్నది ఫ్యాన్ పార్టీ టాక్.

Tags:    

Similar News