డెసిషన్ ఈజ్ ఓవర్

ఏపీ రాజధాని గుర్తులు అమరావతిలో చెరిగిపోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. అమరావతి విషయంలో ఇప్పటికి రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలను బట్టి చూస్తే విశాఖ రాజధాని [more]

;

Update: 2020-01-04 05:00 GMT

ఏపీ రాజధాని గుర్తులు అమరావతిలో చెరిగిపోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. అమరావతి విషయంలో ఇప్పటికి రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలను బట్టి చూస్తే విశాఖ రాజధాని అవడం ఖాయమేనని తేలిపోతోంది. ఇక మొక్కుబడి తంతు మాత్రమే మిగిలివుందని కూడా ఆ మాత్రం రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా చెప్పేస్తున్న మాట. జీఎన్ రావు కమిటీ నడిచిన దారిలోనే ఇపుడు బోస్టన్ కమిటీ కూడా నడిచింది. అదే రకంగా నివేదిక ఇచ్చింది. కాకపోతే అభివృధ్ధి గణాకాలతో కాస్త వివరంగా ఉంది ఈ నివేదిక.

ఛలో విశాఖ….

విశాఖలో ఓ వైపు రాజధాని హడావుడి కూడా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తాజాగా చేసిన విశాఖ టూర్లో ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఆయన ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వ భవనాల సంగతేంటి అన్న వివరాలు పూర్తిగా సేకరించి వెళ్ళారని అంటున్నారు. ఇక విశాఖలో ఎక్కడ ఏ ఏ ఆఫీసులు పెట్టవచ్చు అన్నది కూడా ఒక అవగాహన కూడా ఈ పర్యటనలో వచ్చిందని అంటున్నారు.

విశాఖే బెటర్…..

బోస్టన్ కమిటీ నివేదిక సైతం విశాఖ బెటర్ అనడంతో మరి కొద్ది నెలల్లో విశాఖకు సచివాలయం తరలింపు ఉంటుందని రెవిన్యూ వర్గాల సమాచారంగా ఉంది. ప్రస్తుతానికి అంతా మౌఖిక అదేశాల మీదనే పని సాగుతోంది. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఎక్కడ ఉండాలి. అలాగే సచివాలయం ఎక్కడ ఉండాలి. వేలల్లో వచ్చే సచివాలయ ఉద్యోగులకు అకామిడేషన్ ఎలా అన్నది ఇక్కడ ఒక చర్చగా ఉంది.

కధ నడిపేస్తారా…?

ఇవన్నీ ఇలా ఉంటే ప్రభుత్వం చేయాల్సిన లాంచనాలు మాత్రం కొన్ని మిగిలి ఉన్నాయి. అవన్నీ ఈ నెలాఖరులోగా పూర్తి చేసి అసెంబ్లీ ముఖంగానే విశాఖ మన రాజధాని అంటూ ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రజలకు ఒక సందేశం ఇస్తారని అంటున్నారు. రాజధాని విషయంలో జగన్ పక్కా క్లారిటీతో ఉన్నారు. నివేదికలు అలాగే వచ్చాయి. ఇక రావాల్సింది హై పవర్ కమిటీ నివేదిక, అది కూడా విశాఖ బాటలోనే సాగుతుందని అంటున్నారు. మొత్తానికి కొత్త తెలుగు సంవత్సరాది వచ్చే నాటికి విశాఖ నామ సంవత్సరంగా ఏపీ కధ మారుతుందని అంటున్నారు.

Tags:    

Similar News