పచ్చ దిష్టి తగులుతోంది
దిష్టి తగలకుండా చుక్క పెడతారు. మరి రాజకీయ నాయకుల వక్ర దృష్టి సోకకుండా ఏ చుక్క పెట్టాలో. ఇపుడు పచ్చని నగరం విశాఖపైన పచ్చ పార్టీ విష [more]
;
దిష్టి తగలకుండా చుక్క పెడతారు. మరి రాజకీయ నాయకుల వక్ర దృష్టి సోకకుండా ఏ చుక్క పెట్టాలో. ఇపుడు పచ్చని నగరం విశాఖపైన పచ్చ పార్టీ విష [more]
దిష్టి తగలకుండా చుక్క పెడతారు. మరి రాజకీయ నాయకుల వక్ర దృష్టి సోకకుండా ఏ చుక్క పెట్టాలో. ఇపుడు పచ్చని నగరం విశాఖపైన పచ్చ పార్టీ విష ప్రచారం ఓ స్థాయిలో ఉంది. దాని మీద ఈ ప్రాంతానికి చెందిన మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. విశాఖ రాజధాని అని జగన్ ప్రకటించిన మరుక్షణం ఈ స్మార్ట్ సిటీ పచ్చ పార్టీ నేతల కళ్ళల్లో పడిపోయింది. విశాఖకు రాజధాని రాకూడదు అన్న ఒకే ఒక టార్గెట్ తో చేయాల్సినదంతా చేస్తున్నారు. విష ప్రచారం అయితే పీక్స్ లో ఉంటోంది. విశాఖలో భూములు కబ్జా అన్నారు. దందా అంటున్నారు. ప్రశాంత నగరం అశాంతి అంటున్నారు. నిజానికి టీడీపీ ఏలుబడిలోనే విశాఖ భూములు వందల ఎకరాలు కబ్జా పాలు అయ్యాయి. దానిలో టీడీపీ పెద్దల పాత్ర అటు అమరావతి ఉంచి ఇటు ఉత్తరాంధ్ర వరకూ ఉందని వెల్లువలా ఆరోపణలు ఉన్నాయి.
నిజంగానా…?
పెట్టుబడులు తరలిపోతున్నాయి. వేలల్లో,లక్షల్లో పెట్టుబడులు పోతున్నాయి. ఇదీ టీడీపీ కోరస్ గా ఏడుపు. అధికారంలోకి జగన్ వచ్చి గట్టిగా ఎనిమిది నెలలు కాలేదు. అపుడే మూటా ముల్లె సర్దుకుని పెట్టుబడిదారులు వెళ్ళిపోతున్నారుట. చంద్రబాబు నుంచి చిట్టి తమ్ముడి వరకూ అందరిదీ ఒక్కటే పాట. ఒక్కటే రాగం. నిజమే అని కాసేపు అనుకున్నా అసలు ఏపీకి వచ్చిన పెట్టుబడులెన్ని, ఎన్ని జిల్లాల్లో అవి వచ్చాయి. వాటి కధా కమామీషూ ఏంటి అన్నది ప్రజలకు ఉన్న ధర్మ సందేహం. ఇక విశాఖాలో భూకబ్జాల కధ కూడా టీడీపీ పాలనలోనే జరిగింది. దాని మీద సిట్ వేసి విచారణ నివేదికను అందుకున్నదీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే. మరి నాడు భూ దందా జరిగితే ఏం చర్యలు తీసుకున్నారో తెలియదు కానీ భూముల కబ్జా అంటూ కొత్త పాట పాడుతున్నారు. విశాఖ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని కూడా అంటున్నారు. నిజానికి విశాఖకు ఏం పెట్టుబడులు వచ్చాయో ముందు చెప్పి ఆనక తరలింపు ముచ్చట చెబితే బాగుంటుదని జనం అంటున్నారు.
ఇది కదా అసలు కధ…..
విశాఖలోని హార్ట్ ఆఫ్ ది సిటీగా ఉన్న వేల కోట్ల విలువైన భూములను లూలూ కంపెనీకి అప్పనంగా కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. వారు ఏ పెట్టుబడి పెట్టారో తెలియదు కానీ ప్రభుత్వమే ఎదురు పెట్టుబడి ఇచ్చిందన్నది పెద్ద ఆరోపణ. మరి లూలూ వెళ్ళిపోయింది అంటూ ఏడుపులు తమ్ముళ్ళు అందుకోవడం ఎవరి ప్రయోజనాల కోసమే తెలియాలి. ఇక్కడ పెద్ద ఆడిటోరియం కడితే వీవీఐపీలకు మేలు తప్ప జనానికి ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయో కూడా తమ్ముళ్ళే చెప్పాలి. పైగా నగరం నడిబొడ్డున రద్దీ ప్రాంతంలో ఈ నిర్మాణాలు వద్దు అని నాడు ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి కూడా. ఇక అదానీ డేటా సెంటర్ విషయంలోనూ ఇదే కధను సాక్షాత్తూ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. వారి పెట్టుబడి ప్రతిపాదనలు కేవలం మూడు వేల కోట్లు మాత్రమేనని, డెబ్బయి వేల కోట్ల పెట్టుబడులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇంకో వైపు విశాఖలో బాబు సీఎం గా ఉండగా నాలుగు పారిశ్రామిక సదస్సులు జరిగితే విశాఖకే కాదు, ఏపీకి కూడా కొత్తగా వచ్చిన పెట్టుబడులు ఏమీ లేవు. పైగా ఏపీలోని అప్పటి సదస్సులో అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని ప్రచారం జరిగింది. వారే ఎన్నారైలుగా అవతరించి సదస్సులు విజయవంతం చేశారన్న విమర్శలూ ఉన్నాయి.
అన్నీ పునాదిరాళ్ళేనా…?
రోడ్డు మీద పోయిన ప్రతీ వారికీ నల్ల కోటు కప్పి పెట్టుబడులు వేల కోట్లు వస్తున్నాయని బాబు నాడు దబాయించి మీడియా మీట్లో చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు చెప్పిన సంగతి విదితమే. బాబు పాలనలో విశాఖ మెట్రో ప్రాజెక్ట్ కి అతీ గతీ లేదు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పునాది రాయి తప్ప నిధుల విదిలింపూ లేదని విమర్శలు ఉన్నాయి. విశాఖలో ఎన్నో ప్రాజెక్టులు పెడతామని, కడతామని టీడీపీ ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయి. ఐటీ రాజధాని అలాగే ఉంది. చెన్నై కారిడార్ సంగతీ తేలలేదు. మరి ఇన్ని రకాలుగా విశాఖను మభ్యపెట్టి మోసం చేసి ఇపుడు పెట్టుబడులు తరలిపోతున్నాయని కల్లబొల్లి ఏడుపులు ఎందుకు తెలుగు తమ్ముళ్ళూ అంటున్నారు జనం.