క్యాపిటల్ లుక్ తెప్పిస్తున్నారుగా?
ఎవరు కాదన్నారు విశాఖలో రాజధాని లేదని. ఇప్పటికే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయనే చెప్పాలి. మరోవైపు అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ రైతులు ఆందోళనలు, నిరసనలు రెండు నెలల [more]
;
ఎవరు కాదన్నారు విశాఖలో రాజధాని లేదని. ఇప్పటికే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయనే చెప్పాలి. మరోవైపు అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ రైతులు ఆందోళనలు, నిరసనలు రెండు నెలల [more]
ఎవరు కాదన్నారు విశాఖలో రాజధాని లేదని. ఇప్పటికే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయనే చెప్పాలి. మరోవైపు అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ రైతులు ఆందోళనలు, నిరసనలు రెండు నెలల నుంచి జరుగుతున్నప్పటికీ విశాఖలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంలో ఏమాత్రం మార్పు కన్పించడం లేదు. పైగా తరచి చూస్తే గత కొద్ది రోజులుగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గానే కొనసాగుతున్నట్లు కన్పిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ ను తప్పిస్తే ఇప్పటికే మంత్రుల్లో అధిక భాగం తమ కార్యకలాపాలను విశాఖ నుంచే మొదలు పెట్టారు.
ఇప్పటికే పాలన అంతా…..
ఇప్పటికే విశాఖకు రాజధాని కళ వచ్చేసిందనే చెప్పాలి. రాజధానిలో ఎలా కార్యక్రమాలు జరుగుతుంటాయో అదే రీతిలో ఇప్పుడు విశాఖలోనూ ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధికారులు, మంత్రులు ఇక్కడే దాదాపుగా ఉంటున్నారు. ఇక్కడే సమీక్షలు నిర్వహిస్తున్నారు. పాలన వ్యవహారమంతా ఇక్కడి నుంచే నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. అమరావతిలోని సచివాలయానికి అతి తక్కువ మంది మంత్రులు హాజరవుతున్నారు. నిజానికి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయనున్నట్లు డిసెంబరు 10వతేదీన జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే అధికారికంగా ఇంకా తరలించేలేదు.
పరిశ్రమల శాఖ సమీక్షతో…..
కాని విశాఖలోనే రాజధాని ఉన్నట్లు మంత్రులు సంకేతాలను పంపుతున్నారు మంత్రులు. ఏపీలో పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధిదపై ఇటీవల యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవెలెప్ మెంట్ సమావేశం విశాఖలోనే జరిగింది. ఇక్కడే మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సమవేశంలో సమీక్షించారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న ఐటీ సంస్థల సీఈవోలతో సమావేశాన్ని నిర్వహించారు. ఇక మరో మంత్రి బొత్స సత్యనారాయణ సయితం కీలక సమీక్షలన్నీ ఇక్కడి నుంచే చేస్తున్నారు.
కీలక నిర్ణయాలన్నీ…..
వేసవిలో తలెత్తనున్న నీటి ఎద్దడిపై ముందస్తు సమావేశాన్ని బొత్స సత్యనారాయణ విశాఖలోనే ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏపీలోని పదమూడు జిల్లాల నుంచి మున్సిపల్ అధికారులు హాజరయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు, ఇంజినీర్లతో బొత్స సమీక్షించారు. నీటి ఎద్దడిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. ఈ తరహా సమావేశాలు సహజంగా రాజధానిలోనే జరుగుతాయి. అయితే అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తుండటం, మంత్రులను అడ్డుకుంటుండటంతో ఎక్కువ మంది మంత్రులు తమ శాఖ సమీక్షలను విశాఖలోనే ఇటీవల కాలంలో నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పటికే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కళ వచ్చేసిందంటున్నారు.