విశాఖ రాజధాని…టీడీపీకే లాభమా?
ఇందుగలడందులేడని భాగవతంలో చెప్పినట్లుగా బలమైన సామాజికవర్గంగా ఏపీలో ఉన్న కమ్మవారు పదమూడు జిల్లాల్లో చాలాకాలంగా తమ ఉనికిని గట్టిగానే చాటుకుంటున్నారు. అమరావతిలో ఒకే ఒక సామాజికవర్గం ఆధిపత్యం [more]
;
ఇందుగలడందులేడని భాగవతంలో చెప్పినట్లుగా బలమైన సామాజికవర్గంగా ఏపీలో ఉన్న కమ్మవారు పదమూడు జిల్లాల్లో చాలాకాలంగా తమ ఉనికిని గట్టిగానే చాటుకుంటున్నారు. అమరావతిలో ఒకే ఒక సామాజికవర్గం ఆధిపత్యం [more]
ఇందుగలడందులేడని భాగవతంలో చెప్పినట్లుగా బలమైన సామాజికవర్గంగా ఏపీలో ఉన్న కమ్మవారు పదమూడు జిల్లాల్లో చాలాకాలంగా తమ ఉనికిని గట్టిగానే చాటుకుంటున్నారు. అమరావతిలో ఒకే ఒక సామాజికవర్గం ఆధిపత్యం ఉందని అక్కడ నుంచి రాజధానిని మెల్లగా తగ్గించి విశాఖకు షిఫ్ట్ చేయాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. అయితే ఇది అటు తిరిగి, ఇటు తిరిగి టీడీపీకే లాభంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. విశాఖలో కూడా కమ్మల ఆధిపత్యం బాగానే ఉండడంతో ఇక్కడ రాజకీయ పోరులో వైసీపీకి పెద్ద పోరు తప్పదని విశ్లేషిస్తున్నారు.
దశాబ్దాలుగా….
విశాఖలో ఆతిథ్య రంగం నుంచి మొదలుపెడితే ట్రాన్స్ పోర్ట్, టూరిజం, రియల్ ఎస్టేట్ రంగం, విద్యారంగం ఇలా పలుకుబడి కలిగిన అన్ని రంగాల్లో కమ్మ సామాజిక వర్గం డామినేషన్ కచ్చితంగా కనిపిస్తుంది. ఓ విధంగా విశాఖను రెండవ విజయవాడగా చెప్పుకుంటారు. టీడీపీ పెట్టిన తరువాత పెద్ద సెక్షన్ ఆ సామాజికవర్గం నుంచి విశాఖకు బదిలీ అయిందని కూడా అంటారు. ఇక విశాఖ నుంచి ఇటు శ్రీకాకుళం ఆ వైపుగా ఒడిషా వరకూ కమ్మల ఆధిపత్యం వ్యాపార, స్థిరాస్థి రంగాల్లో పరచుకుని కనిపిస్తుంది.
అభివుధ్ధి ఫలాలు అటే…
ఇప్పటికే విశాఖ సహా చుట్టుపక్కల ప్రాంతాలో పెద్ద ఎత్తున భూములు ఆ సామాజికవర్గానికి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మెజారిటీ ఈ సామాజికవర్గం గుప్పిట్లో ఉండడం చేత ఇక్కడ భూములకు రాజధాని రూపేణా రెక్కలు వస్తే మొదట లబ్ది పొందేది వారేనని అంటున్నారు. అలాగే విశాఖలో కార్పొరేట్ రంగంలోని హొటళ్ళు కూడా వారి చేతుల్లో ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఫీల్డులో కూడా పాతుకుపోవడంతో రాజధాని ఫ్లోటింగ్ పాపులేషన్ వల్ల మెజారిటీ లాభాలు కూడా వారు పొందుతారని మేధావులు చెబుతున్నారు.
మద్దతు అందుకే…..
ఇక రాజకీయంగా చూసుకుంటే కొన్ని దశాబ్దాలుగా విశాఖ ఎంపీ సీటు ఈ సామాజికవర్గానికే రిజర్వ్ చేసి పెట్టేశారు. ఏ పార్టీ అయినా కూడా ఆ వర్గానికే టికెట్ ఇవ్వడం ఆనవాయితీగా మారింది. దాంతో పాటు ఇపుడు తూర్పు నుంచి బలమైన ఎమ్మెల్యేగా ఆ వర్గం నుంచే ఉన్నారు. రేపటి రోజున మేయర్ సీటుతో పాటు, కీలమైన పదవులను అందుకోవడానికి వారు సర్వసిధ్ధంగా ఉన్నారు. దీంతో వారంతా విశాఖ రాజధాని కోరుకుంటున్నారు. ఎన్నడూ లేనిది ఆ సామాజికవర్గానికి చెందిన రియల్టర్లు జై జగన్ అనేస్తున్నారు.
ఢీ కొడతారా….?
ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు వారి కంటే రాజకీయంగా బలహీనంగా రెడ్లు రాజకీయంగానూ, ఇతర అంశాల్లో కనిపిస్తారు. విశాఖ రాజధాని ప్రతిపాదన నేపధ్యంలో ఈ వర్గం నుంచి కూడా కొత్త జోష్ కనిపిస్తోంది. ఓ విధంగా రాజకీయంగా సామాజికంగా ఈ రెండు వర్గాలు సంఘర్షించుకోవడానికి రాజధాని పేరిట విశాఖ వేదిక అవుతుందా అన్న సందేహాలు కూడా పుట్టుకొస్తున్నాయని మేధావులు అంటున్నారు. రాయలసీమ జిల్లాలు దాటి ముందుకు రాని రెడ్లు రాజకీయ బలం పెంచుకునేందుకు ఈ ప్రతిపాదన చేసారన్న ప్రచారమే నిజమైతే రానున్న రోజులో విశాఖ పొలిటికల్ సీన్ పెద్ద ఎత్తున మారిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికైతే విశాఖ రాజధాని టీడీపీకే లాభమన్న విశ్లేషణలు ఉన్నాయి.