అందరినీ వదిలేసినట్లేనా? డ్రగ్స్ కేసులో ఏం జరుగుతోంది?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అసలు ఏం జరుగుతుంది. డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత 12 కేసులు నమోదు అయ్యాయి. 12 కేసులో ఉన్న నిందితులు ఏమైపోయారు. [more]

;

Update: 2020-09-24 18:29 GMT

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అసలు ఏం జరుగుతుంది. డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత 12 కేసులు నమోదు అయ్యాయి. 12 కేసులో ఉన్న నిందితులు ఏమైపోయారు. వాళ్లకు అసలు ఎక్సై జ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ వదిలేసిందా? మత్తులో తుగినా వారినీ అధికారులు ఏం చేశారు? ఇప్పుడు వీటన్నిటి మీద ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 3 సంవత్సరాల క్రితం టాలీవుడ్ డ్రగ్స్ కేసు షేక్ చేసింది. టాలీవుడ్ లో ఉన్న ప్రముఖులు డ్రగ్స్ వాడినట్లుగా వెలుగులోకి వచ్చింది.

72 మందిని విచారించి…..

కాల్విన్ అనే ఒక డ్రగ్స్ మాఫీయా ని అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ కూసాలు కదిలాయి. డ్రగ్స్ వాడుతున్న పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ప్రముఖ నటి నుంచి దర్శకులు నిర్మాతలు ప్రొడక్షన్ సిబ్బందిలో ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నట్లు వెలుగుచూసింది.. అయితే దీనిపై నెలల తరబడి ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ విచారణ జరిపింది.. ఈ కేసులో మొత్తంగా 72 మందిని విచారించింది. ఇందులో 12 మంది సినీ ప్రముఖుల పేర్లను కూడా చేర్చింది. ఈ 72 మంది సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు విద్యార్థులు ప్రముఖులు ఉన్నారు.

అయితే ఈ కేసులో అసలు ఏం జరిగింది..?

ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు ఎలా ముందుకు వెళ్లారు.? శాంపిల్స్ తీసుకున్నారు. కానీ శిక్షలు వేయలేదు . అసలు టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వెనకాల ఎవరు ఉన్నారు. వీటన్నిటి మీద ఇప్పుడు కొత్త కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.. మొత్తానికి చూసినట్లయితే 12 కేసులో ఎక్సైజ్ అధికారులు నమోదు చేశారు.. ఇందులో 8 ఛార్జి షీట్ లు దాఖలు చేశారు. దాఖలు చేసిన చార్జిషీట్లకు సంబంధించిన వ్యవహారాలను కూడా అధికారులు సీక్రెట్ గా పెట్టారు.. ఎక్కడ కూడా విషయాలు బయటకు రాకుండా దాచిపెట్టారు.. అయితే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తానికి 12 కేసులు 8 ఛార్జి షీట్ల దాఖలు చేసినట్లు చెప్పారు. అయితే ఇందులో డ్రగ్స్ వాడకం దారుల పేర్లను మాత్రం చేర్చలేదఅంటూ పేర్కొన్నారు.

ఎవరి పేరు చేర్చకుండా….?

అయితే డ్రగ్స్ యూజ్ చేసిన వారి పేరును ఎందుకు చేర్చలేదని ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.. ఎందుకంటే నెలల తరబడి డ్రగ్స్ వాడిన వారి గురించి విచారించి, రక్తనమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి ఏం చేయాలి అన్నది ప్రశ్న అయితే, 72 మంది డ్రగ్ వాడిన వారి పేర్లను కూడా అధికారులు చేర్చలేదు.. అయితే మరో నాలుగు కేసులు విచారణలో ఉన్నాయి.. వీటికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది , కాబట్టి మేము పేర్లను చేర్చలేదటూ ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.. అయితే ఇది ఎంతవరకు నిజం? 8 చార్జిషీట్లలో ఒకరి పేరు కూడా పెట్ట లేదు .. టాలీవుడ్ ను షేక్ చేసిన డ్రగ్స్ కేసులో చివరకు అందరూ మిస్ అయ్యారు అనే భావన ప్రజల్లో ఉంది. తొలిరోజుల్లో హడావిడి చేసిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఇప్పుడు దాని విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. ముంబయి డ్రగ్స్ కేసు సంచనలం సృష్టించడంతో మరోసారి టాలీవుడ్ కేసు చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News