వారి అండతోనేనా?.. కాలు దువ్వుతుంది అందుకేనా?

నేపాల్ కు ఏమైంది. మిత్రదేశం ఎందుకు కాలు దువ్వుతోంది. చైనా సహకారంతోనే ఈ విధంగా నేపాల్ కయ్యానికే సై అంటుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటి [more]

;

Update: 2020-05-22 17:30 GMT

నేపాల్ కు ఏమైంది. మిత్రదేశం ఎందుకు కాలు దువ్వుతోంది. చైనా సహకారంతోనే ఈ విధంగా నేపాల్ కయ్యానికే సై అంటుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ భారత్ కు నేపాల్ మిత్రదేశమే. సరిహద్దు దేశమన నేపాల్ కు, భారత్ కు దీర్ఘకాలంగా సత్సంబంధాలున్నాయి. కానీ అవి ఇప్పుడు చెడిపోయాయి. నేపాల్ భారత్ తో సై అనేందుకే సిద్ధపడుతుండటం విశేషం. ఇందుకు కారణాలు కూడా అతి చిన్నవే కావడం గమనార్హం.

చిరకాలంగా మిత్రదేశమైనా?

నేపాల్ భారత్ కు చిరకాల మిత్రదేశం. అయితే నేపాల్ ఇప్పుడు శత్రుదేశంగా మారాలని తానే ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది. సరిహద్దు ప్రాంతాలు తమవే నంటూ ఏకంగా పార్లమెంటులో తీర్మానం చేసింది. భారత్ సరిహద్దు ప్రాంతాలైన లిపులెక్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు భారత్ లో అంతర్భాగమే. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన తర్వాత భారత్ విడుదల చేసిన కొత్త మ్యాప్ లో ఈ ప్రాంతాలను తమవిగా పేర్కొంది.

సరిహద్దు ప్రాంతాలు…..

దీనికి నేపాల్ అభ్యంతరం తెలిపింది. ఆ మూడు ప్రాంతాలు తమవేనంటూ ఏకంగా నేపాల్ పార్లమెంటులో తీర్మానం చేసింది. భారత్ కు సవాల్ విసిరింది. మానస సరోవవర్ యాత్ర కోసం లిపులెక్ ప్రాంతంలో భారగ్ రహదారిని నిర్మించింది. యాత్రికుల సౌకర్యం కోసమే ఈ రహదారి నిర్మాణాన్ని భారత్ చేపట్టింది. దీనిపై కూడా నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా నేపాల్ కూడా కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. ఇందులో లిపులెక్, కాలాపాని, లింపుయధురలను తమ భూభాగంలోకి చేర్చుకుంది.

పోరు తప్పేట్లు లేదు….

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పైగా కరోనా వైరస్ కు భారత్ కారణమంటూ నేపాల్ ప్రధాని ఓలీ వ్యాఖ్యానిచండం భారత్ ను మరింత రెచ్చగొట్టినట్లయింది. నేపాల్ వెనక చైనా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా వెనకుండి భుజం తట్టడం వల్లనే నేపాల్ భారత్ పై ఒంటికాలిపై లేవడానికి ట్రై చేస్తుందంటున్నారు. ఎప్పుడూ నేపాల్ భారత్ తో అలా వ్యవహరించలేదు. కమ్యునిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలా జరుగుతుంది. చైనాతో చెలిమి, భారత్ తో వైరం పెంచుకునేందుకే నేపాల్ రెడీ అయిందని చెప్పాలి.

Tags:    

Similar News