జగన్.. ఆ.. క్లారిటీ సరిపోతుందా…!
చాలా విషయాల్లో వైసీపీ అధినేత జగన్ క్లారిటీగా ఉంటారు. పార్టీ నిర్ణయాలు, ఎన్నికల హామీలు, ప్రకటనల విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉంటారనేది వాస్తవం. ప్రస్తుతం మరో [more]
చాలా విషయాల్లో వైసీపీ అధినేత జగన్ క్లారిటీగా ఉంటారు. పార్టీ నిర్ణయాలు, ఎన్నికల హామీలు, ప్రకటనల విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉంటారనేది వాస్తవం. ప్రస్తుతం మరో [more]
చాలా విషయాల్లో వైసీపీ అధినేత జగన్ క్లారిటీగా ఉంటారు. పార్టీ నిర్ణయాలు, ఎన్నికల హామీలు, ప్రకటనల విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉంటారనేది వాస్తవం. ప్రస్తుతం మరో మూడు మాసాల్లో రాష్ట్రంలో సంచలనాలకు వేదిక కానున్న ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికల విషయంలో అధికార టీడీపీ కన్నా కూడా విపక్షం వైసీపీ అధినేత జగన్ చాలా క్లారిటీగా ఉన్నారనే అనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల వ్యూహం వరకు, పథకాల ప్రకటన నుంచి వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లే వరకు కూడా జగన్ క్లారిటీ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపైనే జగన్ స్పందించారు. తన వ్యూహం ఏమిటో ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోరు చేస్తానని వెల్లడించాడు. ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదని స్పష్టం చేశాడు.
బాబు, పవన్ లు….
నిజానికి ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితిలో ప్రతిపార్టీ కూడా పొత్తులతోనే రాజకీయాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది. జనసేన అధినేత పవన్ పైకి పొత్తులు లేవని చెబుతూనే సంస్థాగతంగా చాలా బలంగా ఉన్న కమ్యూనిస్టులతో కలిసి ఆయన ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతు న్నారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగుతున్నారు. అయితే, ఏపీలో పొత్తుపై మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రానప్పటికీ.. ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబుతో కలిసి వెళ్లే పరిస్థితి మరో పార్టీకి లేదు. దీనికితోడు ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో చంద్రబాబు కూడా ఎప్పుడూ పొత్తులు లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్న పరిస్థితి కూడా లేదు. దీంతో రాజకీయంగా జగన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.
ఎన్నికల అనంతరమే….
గత ఎన్నికల సమయంలో ఇలానే ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని దూరం చేసుకున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపించాయి. ఇక, ఇప్పుడు పవన్ కలిసి వస్తున్నా.. కేవలం టికెట్ల సర్దుబాటు విషయంలో ఆయనకు జగన్‌కు సరిపడలేదని అందుకే ఒంటరి పోరుకు సిద్ధమవుతు న్నారని అంటున్నారు. కానీ, రాష్ట్రంలో గతానికి భిన్నంగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలకు జిల్లాలు కులాలు, వర్గాల ప్రాతిపదికగా మారిపోయిన నేపథ్యంలో జగన్ మరోసారి ఆలోచించి వెళ్తే బెటర్ అని అంటున్నారు విశ్లేషకులు. మరి జగన్ తన నిర్ణయమే ఫైనల్ అంటారో లేక ఆలోచిస్తాడో చూడాలి. ఇక, వైసీపీలోని కొందరు నాయకులు మాత్రం ఎన్నికల తర్వాత పొత్తు ఉంటుందనే సంకేతాలు పంపుతున్నారు. ఇప్పుడున్న పలు సర్వేల ఆధారంగా ఏపీలో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్‌కు సరిపోయినన్ని సీట్లు లభించే అవకాశం లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల తర్వాతైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకునే పార్టీ ఖచ్చితంగా పొత్తుకు రెడీ కావాల్సి ఉంటుందనేది విశ్లేషకుల మాట.