రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారా?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు అలాంటి పరిణామమే బెజవాడ రాజకీయాల్లోనూ అందునా.. అధికార పార్టీలోనూ జరుగుతుండడం గమనార్హం. ఎన్నో ఆశలతో వైసీపీలోకి వచ్చిన [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు అలాంటి పరిణామమే బెజవాడ రాజకీయాల్లోనూ అందునా.. అధికార పార్టీలోనూ జరుగుతుండడం గమనార్హం. ఎన్నో ఆశలతో వైసీపీలోకి వచ్చిన [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు అలాంటి పరిణామమే బెజవాడ రాజకీయాల్లోనూ అందునా.. అధికార పార్టీలోనూ జరుగుతుండడం గమనార్హం. ఎన్నో ఆశలతో వైసీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే, మాజీ టీడీపీ నేత యలమంచిలి రవి ఇప్పుడు ఏకంగా రాజకీయాలకు స్వస్తి చెప్పేందుకు నిర్ణయించుకున్నట్టు తాజాగా ఓ సంచలన వార్త బెజవాడలో హల్‌చల్ చేస్తోంది. ఈయన ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి తూర్పు నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డారు. 2019 ఎన్నికలకు ముందే ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పేసి పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలుసుకుని యలమంచిలి రవి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
సామాజికవర్గంలో సక్సెస్ కాలేక..?
కమ్మ వర్గానికి చెందిన యలమంచిలిని పార్టీలోకి తీసుకుంటే.. బెజవాడలో కమ్మ సామాజిక వర్గం వైసీపీకి జై కొడుతుందని భావించిన జగన్ కూడా ఆయన రాకను స్వాగతించారు. అయితే, యలమంచిలి రవి కోరిక మాత్రం వైసీపీలోకి వచ్చినా నెరవేరలేదు. జగన్‌కు మిత్రుడు పొట్లూరి వరప్రసాద్ ప్రోద్బలంతో తూర్పు టికెట్‌ను బొప్పన భవకుమార్ తెచ్చుకున్నారు. దీంతో యలమంచిలి రవిలో తీవ్ర నిరుత్సాహం ఏర్పడింది. ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ క్రమంలో యలమంచిలి రవి చురుగ్గా పనిచేయలేదని, కమ్మ వర్గాన్ని వైసీపీకి చేరువ చేయడంలో ఆయన సక్సెస్ కాలేదని నివేదికలు జగన్‌కు అందాయి. ఇది నిజమని కూడా పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
తనకు కష్టమేనని….
తనకు తూర్పు టికెట్ లభించని నేపథ్యంలో యలమంచిలి రవి ఎన్నికల సమయంలో మౌనం పాటించారని, కనీసం ఎక్కడా ప్రచారంలో కూడా పాల్గొనలేదని అందుకే వైసీపీ తూర్పులో ఓడిపోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ను కలిసేందుకు ఇప్పటికి మూడు సార్లు ప్రయత్నించినా యలమంచిలి రవికి అప్పాయింట్‌మెంట్ లభించలేదు. ఇదిలావుంటే, బొప్పనకు విజయవాడ నగర పార్టీ పగ్గాలు అప్పగించడం యలమంచిలి రవికి మరింత ఆగ్రహం తెప్పించింది. తనకు టికెట్ రాకపోవడానికి కారణమైన బొప్పన ఇప్పుడు విజయవాడ పార్టీ ఇంచార్జ్‌గా ఉండడంతో ఇకతనకు గుర్తింపు కష్టమేనని యలమంచిలి రవి డిసైడ్ అయ్యారు.
పార్టీని వీడలేక..వేరే పార్టీలోకి వెళ్లలేక….
ఇటు తూర్పు నియోజకవర్గంలో రాజకీయంగా చాలా జూనియర్ అయిన దేవినేని అవినాష్‌ను పార్టీలోకి తీసుకుని నియోజకవర్గ ఇన్‌చార్జ్ పగ్గాలు ఇవ్వడంతో ఇక యలమంచిలి రవిని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలో అటు పార్టీలో ఉండలేక, వేరే పార్టీలోకి వెళ్లలేక, యలమంచిలి రవి ఏకంగా రాజకీయంగా దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.