మాది అంటే మాది అంటున్నారు … ?
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఖర్చు పెట్టే సొమ్మంతా ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చేదే. ఆయా ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అది వేరే ప్రభుత్వం అధికారంలోకి [more]
;
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఖర్చు పెట్టే సొమ్మంతా ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చేదే. ఆయా ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అది వేరే ప్రభుత్వం అధికారంలోకి [more]
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఖర్చు పెట్టే సొమ్మంతా ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చేదే. ఆయా ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అది వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక చూడాలి ఆ పార్టీల విన్యాసాలు. ఈ ఘనత మా వల్లే అంటే మా వల్లే అని జగడం మొదలౌతుంది. ఈ ధోరణి అనాదిగా వస్తున్నదే. దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదని స్పష్టంగా చెప్పొచ్చు. ప్రజల కోసం ప్రజలు ఇచ్చిన డబ్బు కు ఈ గోల ఏమిటి అని సామాన్యుల నుంచి ప్రజాస్వామ్య వాదులంతా వాపోయినా రాజకీయ పార్టీల ధోరణిలో మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదు.
పోలవరం నుంచి అన్ని ప్రాజెక్ట్ లలో ఇదే తీరు …
గతంలో పోలవరం ప్రాజెక్ట్ ను భగీరథ ప్రయత్నంగా తలకెత్తుకుని ఎలాంటి అనుమతులు లేకుండా మొదలు పెట్టారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే ఆయన మరణానంతరం ఆ ప్రాజెక్ట్ కి జాతీయ హోదా దక్కడం టిడిపి అధికారంలోకి వచ్చి రోజు పోలవరం సోమవారం అనేది. కట్ చేస్తే ఆ తరువాత వైసిపి వచ్చింది. ఇది తమ తండ్రి డ్రీం ప్రాజెక్ట్ అని ప్రచారం మొదలు పెట్టేసింది. సీన్ లోకి బిజెపి కూడా వచ్చి చేరింది. డబ్బులు ఇచ్చేది మేము అని తేల్చింది. ఇలా ఎవరి గోల వారిది.
ఇప్పుడు దుర్గమ్మ ఫ్లై ఓవర్ …
విజయవాడ లో దుర్గమ్మ ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రారంభానికి సిద్ధం అయ్యింది. ఇది మా ఘనత అంటే మాదే అంటూ అన్ని పక్షాలు ఇప్పుడు సీన్ లోకి వచ్చేశాయి. యుపిఎ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టబడి బిజెపి ప్రభుత్వం వచ్చాక వేగంగా నిధులు మంజూరు అయి టిడిపి, వైసిపి ప్రభుత్వాల పర్యవేక్షణలో ఈ వారధి రూపుదాల్చింది. అయితే ఇప్పుడు ఎవరికి వారు తమ క్రెడిట్ గా చాటుకునేందుకు పోటీ పడిపోతున్నారు. జనం డబ్బులతోనే కట్టిన వారధికి సొంత డబ్బులు ఇచ్చి కట్టినట్లు పార్టీలు గొప్పలు పోవడం మాత్రం మానడం లేదు. ఎప్పటికి వీరికి అర్ధం అవుతుందో లేదో కానీ ఈ కీర్తి కండూతి కోసం ఆరాటం ఎప్పటికి పోతుందో అని ప్రజల్లో చర్చ నడుస్తుంది.