ఆ అన్నదమ్ముల 40 ఏళ్ల పాలిటిక్స్‌కు వైసీపీ, టీడీపీ డోర్లు వేసేశాయ్
పశ్చిమగోదావరి జిల్లాలో పెండ్యాల ఫ్యామిలీకి ఉన్న ఘనమైన చరిత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. కొవ్వూరు నియోజకవర్గంలో దొమ్మేరు జమిందారులుగా వీరికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. [more]
;
పశ్చిమగోదావరి జిల్లాలో పెండ్యాల ఫ్యామిలీకి ఉన్న ఘనమైన చరిత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. కొవ్వూరు నియోజకవర్గంలో దొమ్మేరు జమిందారులుగా వీరికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. [more]
పశ్చిమగోదావరి జిల్లాలో పెండ్యాల ఫ్యామిలీకి ఉన్న ఘనమైన చరిత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. కొవ్వూరు నియోజకవర్గంలో దొమ్మేరు జమిందారులుగా వీరికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. పెండ్యాల జమిందారుల్లో పెండ్యాల వెంకట కృష్ణారావు, ఆయన సోదరుడు అచ్చిబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల రాజకీయాలను మూడు దశాబ్దాల పాటు శాసించారు. వీరు మాజీ ఎమ్మెల్యే, దివంగత ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్‌కు స్వయానా మేనల్లుళ్లు. వీరి సొంత నియోజకవర్గం అయిన కొవ్వూరుతో పాటు పక్కనే రిజర్వ్‌డ్ నియోజకవర్గాలుగా ఉండే పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల్లో కూడా వీరు చెప్పిన క్యాండెట్లకే నాడు టీడీపీ అభ్యర్థిత్వాలు డిసైడ్ అయ్యేవి. కొవ్వూరులో పేరుకు మాత్రమే కృష్ణబాబు ఎమ్మెల్యేగా ఉన్నా చక్రం మొత్తం అచ్చిబాబే తిప్పేవారు. 1983లో ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పటి నుంచి 1999 వరకు వరుస విజయాలు సాధించిన కృష్ణబాబు ఓ సారి సాధారణ ఎన్నికల్లో ఏకంగా 58 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. ఓ సాధారణ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు పోటీ చేసినప్పుడు వచ్చిన మెజార్టీల లెక్క చూస్తే కృష్ణబాబుదే ఇప్పటకీ తిరుగులేని మెజార్టీ.
సోదరుల మధ్య అనైక్యత…..
జిల్లాలో టీడీపీ నుంచి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇంత మెజార్టీతో గెలవలేదు. పార్టీ గెలిచిన 1999లో ఓడిన కృష్ణబాబు, పార్టీ ఓడిన 2004లో గెలిచారు. 2009 కొవ్వూరు ఎస్సీలకు రిజర్వ్ కావడంతో పెండ్యాల సోదరుల ప్రత్యక్ష రాజకీయానికి తెరపడింది. 2009లో పెండ్యాల సోదరులకు సీటు లేకపోయినా వీరు మాత్రం కొవ్వూరులో టీవీ రామారావుకు, గోపాలపురంలో తానేటి వనితకు, నిడదవోలులో బూరుగుపల్లి శేషారావుకు సీట్లు ఇప్పించుకుని.. వారిని గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కట్ చేస్తే జగన్ వైసీపీ పెట్టాక సోదరుల మధ్య రాజకీయ ఐనైక్యత నేపథ్యంలో అన్న మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు వైసీపీ చెంత చేరిపోయారు. జగన్ సైతం కమ్మ వర్గంలో సీనియర్ కావడంతో కృష్ణబాబును అక్కున చేర్చుకుని ఆయన అల్లుడు రాజీవ్ కృష్ణకు 2014 ఎన్నికల్లో నిడదవోలు సీటు ఇచ్చారు.
ఆయన మాత్రం టీడీపీలోనే….
కృష్ణబాబు వైసీపీలోకి వెళ్లినా సోదరుడు అచ్చిబాబు మాత్రం టీడీపీలో ఉండడంతో పాటు చంద్రబాబుకు మరింత నమ్మకంగా మారారు. ఈ క్రమంలోనే 2009లో తాము సీటు ఇప్పించి గెలిపించుకున్న టీవీ. రామారావు తమకే ఎదురు తిరగడంతో ఆయన్ను పక్కన పెట్టేసి కేఎస్. జవహర్‌కు సీటు ఇప్పించుకున్నారు. విచిత్రం ఏంటంటే 2009లో కృష్ణబాబు తానేటి వనితకు గోపాలపురం టీడీపీ సీటు ఇప్పించుకోగా.. అదే వనిత కృష్ణబాబుతో కలిసి వైసీపీలోకి జంప్ చేసేశారు. ఈ క్రమంలోనే ఆమెకు 2014లో కొవ్వూరు వైసీపీ సీటు ఇప్పించుకోగా…. ఆ ఎన్నికల్లో ఆమె ఓడినా మొన్న ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు.
ఒకరి రాజకీయం….
ఇక కృష్ణబాబు 2009లో నిడదవోలు టీడీపీ సీటు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లికి ఇప్పించుకోగా 2014 ఎన్నికల్లో అదే బూరుగుపల్లిపై వైసీపీ నుంచి కృష్ణబాబు అల్లుడే స్వయానా పోటీ చేసి ఓడారు. ప్రస్తుతం కృష్ణబాబు వయోః భారంతో పాటు అనారోగ్యంతో రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయారు. గత ఎన్నికల్లో ఆయన అల్లుడు రాజీవ్ కృష్ణ కూడా పోటీకి దూరంగా ఉన్నారు. అయితే జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీవ్‌కు జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో నామినేటెడ్ పదవి దక్కింది. ఏదేమైనా అన్నదమ్ముల్లో కృష్ణబాబు రాజకీయం పూర్తిగా ముగిసిపోయింది.
అచ్చిబాబు పట్టు నిలుపుకుంటారా.. ?
కృష్ణబాబు వైసీపీలోకి వెళ్లగా టీడీపీలో ఉన్న అచ్చిబాబుకు కొవ్వూరు వరకు చంద్రబాబు ఫుల్ ఫ్రీడం ఇచ్చారు. అయితే 2009లో ఏ టీవీ రామారావును వీళ్లు ఎమ్మెల్యేను చేశారో వారితో వీరికి వైరం రాగా.. తర్వాత కేఎస్. జవహర్ మంత్రి అయ్యాక ఆయనతోనూ వీరికి వైరం వచ్చింది. చివరకు మంత్రిగా ఉన్నా అచ్చిబాబు మాటను కాదనలేకే చంద్రబాబు జవహర్‌ను తిరువూరుకు పంపారు. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి ఓడిన వంగలపూడి అనిత తిరిగి పాయకరావుపేటకు వెళ్లిపోయారు.
చంద్రబాబు కూడా…
అయితే చంద్రబాబు అనూహ్యంగా అచ్చిబాబుతో సంబంధం లేకుండా జవహర్‌ను కొవ్వూరు నియోజకవర్గం ఉన్న రాజమహేంద్రవరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ జవహర్‌కు సీటు ఇచ్చే క్రమంలోనే చంద్రబాబు జవహర్‌కు ఈ పదవి ఇచ్చారని టాక్ ? చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కొవ్వూరు సీటు జవహర్‌కే ఇస్తే ఇక్కడ అచ్చిబాబు రాజకీయం కూడా చివరి దశకు చేరుకున్నట్టే అవుతుంది. మరి అప్పటి సమీకరణలు ఎలా? మారతాయో? అన్నది మాత్రం చూడాలి.