Badvel : బద్వేలు నేతకు బహుమతి అదేనా?

బద్వేలు ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతుంది. వైసీపీ విజయం ఇక్కడ ఖాయమై పోయింది. అయితే ఇక్కడ బద్వేలు గిఫ్ట్ ను జగన్ ఆయనకు ఇచ్చేందుకు రెడీ చేశారు. [more]

;

Update: 2021-10-26 12:30 GMT

బద్వేలు ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతుంది. వైసీపీ విజయం ఇక్కడ ఖాయమై పోయింది. అయితే ఇక్కడ బద్వేలు గిఫ్ట్ ను జగన్ ఆయనకు ఇచ్చేందుకు రెడీ చేశారు. బద్వేలులో వైసీపీ నేత డీసీ గోవిందరెడ్డి ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయింది. అయితే ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశముంది. త్వరలో 14 ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానుండటంతో ఆయనకు తిరిగి ఎమ్మెల్సీ పదవి దక్కే ఛాన్స్ ఉందంటున్నారు.

నమ్మకమైన నేతగా…

డీసీ గోవిందరెడ్డి పార్టీకి నమ్మకమైన నేతగా ఉన్నారు. దీంతో బద్వేలు ఉప ఎన్నిక పూర్తయిన వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఉండనుంది. ఈ ఎమ్మెల్సీ పదవుల భర్తీల్లో డీసీ గోవింద్ రెడ్డికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. అయితే కడప జిల్లాలో అనేక మంది ఎమ్మెల్సీ పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం నేతలు ఎమ్మెల్సీ పదవులపై ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారు.

రామసుబ్బారెడ్డి లైన్ లో ఉన్నా….

ఇప్పటికే జమ్మలమడుగు లో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ మాట ఇచ్చారన్న ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాల మూడు, స్థానికసంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. కడప జిల్లాలో మాత్రం ఎమ్మెల్యే కోటా కిందనే భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో రామసుబ్బారెడ్డికి జగన్ ఇస్తారా? బద్వేలులో వైసీపీ ఇన్ ఛార్జి డీసీ గోవింద రెడ్డికి ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఉప ఎన్నిక తర్వాత…..

అయితే బద్వేలు ఉప ఎన్నిక రాకపోయి ఉంటే మరోసారి డీసీ గోవిందరెడ్డికి రెన్యువల్ అయి ఉండేది కాదంటున్నారు. ఉప ఎన్నిక రావడంతో ఆయనకే ఎక్కువ అవకాశాలున్నాయని చెబుతున్నారు. రామసుబ్బారెడ్డికి వచ్చే సారి అవకాశం ఇవ్వాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద బద్వేలు నేత డీసీ గోవిందరెడ్డికి ఫలితాలు వెలువడిన అనంతరం ఎమ్మెల్సీ పదవిని జగన్ బహుమతిగా ఇచ్చే అవకాశముంది.

Tags:    

Similar News