కన్ఫ్యూజన్ లో యడ్యూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అయోమయంలో ఉన్నారు. ఒకవైపు పాలనను చూసుకుంటూ మరోవైపు మంత్రి వర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి వారం రోజులు [more]

Update: 2019-08-07 17:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అయోమయంలో ఉన్నారు. ఒకవైపు పాలనను చూసుకుంటూ మరోవైపు మంత్రి వర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి వారం రోజులు దాటుతున్నా ఇంకా మంత్రివర్గ విస్తరణపై ఒక క్లారిటీ రాలేదు. మంత్రి వర్గ కూర్పుపై యడ్యూరప్ప కసరత్తు చేసినప్పటికీ బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం ఇంకా దానికి ఆమోద ముద్ర వేయలేదు. అధిష్టానం నుంచి ఇంకా పిలుపు వస్తుందని యడ్యూరప్ప ఎదురు చూస్తున్నారు.

వారం రోజులు గడిచినా…..

యడ్యూరప్ప ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలను చేపట్టి వారం రోజులు గడిచింది. ఇంకా మంత్రివర్గాన్ని విస్తరించలేదు. పాలన సజావుగా సాగాలంటే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వివిధ శాఖలకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్ లో పడిపోయాయి. అయితే మంత్రివర్గంలో చేరడానికి అనేకమంది ఆసక్తిని చూపుతుండటంతో యడ్యూరప్ప విస్తరణ పై ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.

కేంద్ర నాయకత్వం ఆదేశాలు….

అసమ్మతి తలెత్తకుండా మంత్రివర్గ విస్తరణ చేయాల్సి ఉంటుంది. పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం యడ్యూరప్పకు ఆ అవకాశం ఇవ్వలేదు. పైగా కొన్ని షరతులు విధించినట్లు తెలిసింది. మంత్రివర్గంలో చేర్చుకునే వారు పార్టీకి బద్ధులై ఉండాలని, జిల్లాల్లో సత్తా చాటే వ్యక్తి అయి ఉండాలని, గతంలో అవినీతి మరకలు ఉండకూడదన్న నిబంధనలు ఉంచింది. దీంతో యడ్యూరప్ప మరోసారి పార్టీ నాయకత్వం పంపిన నిబంధనల మేరకు జాబితాను రూపొందించే పనిలో పడ్డారు.

తీర్పు వస్తుందని…..

ఇదేమీ తెలియని ఆశావహులు మాత్రం యడ్యూరప్ప ఇంటికి క్యూ కడుతున్నారు. మరోవైపు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేంత వరకూ వేచి చూడాలని కూడా యడ్యూరప్ప భావిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టు ఈ అశంపై తీర్పు వెలువరించే అవకాశముంది. దీంతో పది తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. ఈలోగా ఢిల్లీ వెళ్లి జాబితాపై సీలు వేయించుకుని రావాలన్న యోచనలో యడ్యూరప్ప ఉన్నారు. ఎవరెవరికి మంత్రిపదవులు ఇవ్వాలి? అధిష్టానం మనసులో ఎవరున్నారు? అన్న అయోమయంలో యడ్యూరప్ప ఉన్నారు.

Tags:    

Similar News