ఈ సారి వ్యూహాత్మకంగానే.. గురి తప్పకుండా?
ఆంధ్రప్రదేశ్ సర్కార్ మూడు రాజధానులపై వేగంగానే పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలోనే తిరిగి అమరావతి రైతు ఉద్యమాన్ని విపక్షాలు ఉధృతం చేయడానికి రీజన్ గా విశ్లేషకులు భావిస్తున్నారు. [more]
;
ఆంధ్రప్రదేశ్ సర్కార్ మూడు రాజధానులపై వేగంగానే పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలోనే తిరిగి అమరావతి రైతు ఉద్యమాన్ని విపక్షాలు ఉధృతం చేయడానికి రీజన్ గా విశ్లేషకులు భావిస్తున్నారు. [more]
ఆంధ్రప్రదేశ్ సర్కార్ మూడు రాజధానులపై వేగంగానే పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలోనే తిరిగి అమరావతి రైతు ఉద్యమాన్ని విపక్షాలు ఉధృతం చేయడానికి రీజన్ గా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండోసారి శాసనమండలిలో సీఆర్డీఏ రద్దు, రాజధానుల వికేంద్రీకరణ బిల్లులు ప్రవేశపెట్టడం అవి ఆమోదం కాకపోయినా రెండోసారి అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే చట్టం రూపం దాల్చినట్లే అవుతుంది. దాంతో తదుపరి అడుగులు సర్కార్ వడివడిగా వేస్తుంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఈసారి వ్యూహాత్మకంగా జగన్ సర్కార్ అనుకున్నట్లే చేయడానికి ముందుకు వెళుతుంది.
పరిపాలన రాజధాని లో …
విశాఖపట్నం కార్యనిర్వహణ రాజధానిని పరిశీలించారు డిజిపి గౌతమ్ సవాంగ్. వాస్తవానికి మావోయిస్టు లు, శాంతి భద్రతల అంశం పరిశీలనకు అని అధికారికంగా ఆయన పర్యటన పేర్కొన్నప్పటికి పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ కు సరైన స్థల అన్వేషణ అందుబాటులో ఉన్న భవనాలు ఏమిటి అనే అంశాలకోసమే అన్న చర్చ సాగుతుంది. అందుకే ఏకంగా డిజిపి మూడు రోజుల పాటు సవాంగ్ విశాఖలో మకాం అని చెబుతున్నారు.
వీలయినంత త్వరగా…
ఇలా విశాఖ కు అత్యున్నత అధికారులు ఎవరు పర్యటించినా రాజధాని ఉద్యమం చేపట్టిన టిడిపి లో గుబులు రేగుతుంది. తమ పోరాటం మరింత స్పీడ్ చేసేందుకు ప్రయత్నిస్తూ లైవ్ లో ఉద్యమాన్ని ఉంచేందుకు తిప్పలు పడుతుంది ప్రధాన విపక్షం. త్వరలోనే పరిపాలన రాజధానిని జగన్ విశాఖకు మారుస్తారన్న టాక్ బాగా ఉంది. మొత్తానికి పోలీస్ బాస్ టూర్ మాత్రం మావోయిస్టు లకు ఉలిక్కిపాటు కన్నా విపక్షాల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది