విజయంపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రజలు తమపై ఎంతో విశ్వాసంతో గొప్ప విజయాన్ని అందించారని, ఈ విజయం తమపై మరింత బాధ్యత పెంచిందని కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు [more]
;
ప్రజలు తమపై ఎంతో విశ్వాసంతో గొప్ప విజయాన్ని అందించారని, ఈ విజయం తమపై మరింత బాధ్యత పెంచిందని కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు [more]
ప్రజలు తమపై ఎంతో విశ్వాసంతో గొప్ప విజయాన్ని అందించారని, ఈ విజయం తమపై మరింత బాధ్యత పెంచిందని కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు నెలలలో జగన్ మంచి ముఖ్యమంత్రి అనేలా మన పరిపాలన ఉంటుందన్నారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ శాసనసభాపక్ష నేతగా జగన్ పేరును సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పార్థసారథి, ముస్తఫా, ఆదిమూలపు సురేష్ బలపరిచారు. ఎమ్మెల్యేలంతా తమ నేతగా జగన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కు వారంతా శుభాకాంక్షలు తెలియజేశారు.
దేవుడు బాగా బుద్ధి చెప్పాడు
శాసనసభాపక్ష సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్యాయాలు, అక్రమాలకు పాల్పడితే దేవుడు ఎలా మొట్టికాయలు వేస్తారనేది చంద్రబాబుకు చూపించారని అన్నారు. తమ పార్టీ నుంచి అన్యాయంగా 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు చివరకు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలే గెలిచారని, అది కూడా మే 23నే అంటే దేవుడు ఎలా బుద్ధి చెప్పారో అర్థం చేసుకోవచ్చన్నారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ సమస్య వస్తే అక్కడ వైసీపీ ఉందని గుర్తు చేశారు. అందుకే తమ పార్టీ 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో స్వీప్ చేసేలా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఈ తీర్పుతో మనపై మరింత విశ్వసనీయత పెరిగిందన్నారు. 2019 అయిపోయిందని, ఇప్పుడు తమ టార్గెట్ 2024 అని, అప్పుడు ఇంతకంటే గొప్ప విజయం సాధించేలా పరిపాలన అందించాలని, ప్రజలకు మంచి చేయాలని అన్నారు. ఇంతపెద్ద విజయం సాధించడానికి తనకు ప్రతీ గ్రామంలో ప్రతీ కార్యకర్త తోడున్నారు కాబట్టే ఇది సాధ్యమైందన్నారు. ఆరు నెలల్లో జగన్ మంచి ముఖ్యమంత్రి అనేలా పరిపాలన చేస్తామన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, వాటిని కూడా స్వీప్ చేయాలని సూచించారు.