chandrababu and jagan : ఈసారి ఎవరి ఫొటో వాల్యూ ఎంత?

ఎన్నికలంటే సహజంగా అధినేత చరిష్మా మీదే ఆధారపడి గెలుపోటములుంటాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఫొటో ప్రధానంగా మారింది. ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుంటూనే [more]

Update: 2021-09-23 14:30 GMT

ఎన్నికలంటే సహజంగా అధినేత చరిష్మా మీదే ఆధారపడి గెలుపోటములుంటాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఫొటో ప్రధానంగా మారింది. ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుంటూనే గెలుస్తామన్న నమ్మకం ఏర్పడింది. ఇక ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతటి చరిష్మా సంపాదించారు. ఆయన అమలు చేసిన వివిధ పథకాలు ఆయనకు కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ ఫొటో ఓట్లు కురిపించి పెట్టింది.

బొమ్మ పెట్టుకుని….

ఇక 2019 ఎన్నికల్లో జగన్ బొమ్మ పెట్టుకుని అనేక మంది గెలిచారంటారు. జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలతో ఆ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. కానీ ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణరాజు పార్టీ అధినాయకత్వంతో తేడా వచ్చి తాను జగన్ ఫొటోతో గెలలేదని చెప్పారు. తాను వ్యక్తిగతంగా తన ఫొటోతోనే గెలిచానని రఘురామ కృష్ణరాజు అన్నారు. అంటే అధికారంలోకి వచ్చాక జగన్ ఫొటోకు రాజుగారు విలువ ఇవ్వలేదు.

ఈసారి బాబు ఫొటోతోనే…

ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సవాల్ విసురుతున్నారు. తమకు ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తల అవసరం లేదని వారు చెబుతూనే తాము చంద్రబాబు ఫొటోతోనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని సవాల్ విసురుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని, చంద్రబాబు ఫొటోతోనే తాము ఎన్నికలకు వెళతామని ఆయన చెప్పడం చూస్తే ఈసారి చంద్రబాబు ఫొటోకు ఉన్న వాల్యూ ఎంత అన్నది చర్చ అయింది.

వాల్యూ ఎంతంటూ?

నిజానికి ఎన్నికల్లో అధినేతల చరిష్మా కొంత వరకే పనిచేస్తుంది. వారి పాలన తీరు, సమర్థత వంటివి ప్రజలు పరిగణనలోకి తీసుకుంటారు. అయితే జగన్ మరోసారి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకోవడంతో జగన్ ఫొటోకు వాల్యూ లేకనే ఆయనను తెచ్చుకున్నారన్నారని టీడీపీ నేతలు మాటల దాడికి దిగారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరి ఫొటో వాల్యూ ఎంత? అన్న చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News