Ys jagan : ఒకరికి ఒకరు… చేదోడు వాదోడుగా…?

రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య జలవివాదం ఇబ్బందికరంగా మారనుంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా రాష్ట్రం కోసం ఇద్దరూ నేతలు పోరాడాల్సి ఉంటుంది. ఇప్పటికే [more]

Update: 2021-10-21 12:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య జలవివాదం ఇబ్బందికరంగా మారనుంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా రాష్ట్రం కోసం ఇద్దరూ నేతలు పోరాడాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. ఏపీ ప్రభుత్వం వ్యవహారశైలి వల్లనే ప్రాజెక్టులు కేంద్రం పర్యవేక్షణలోకి వెళ్లాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఏపీకి నష్టం చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు.

ఎన్నికల నాటికి….

ఇవి పైకి కనపడుతున్నాయి. కానీ ఎన్నికలకు ముందు ఇద్దరూ పరోక్షంగా ఒకరికి ఒకరు సహకరించుకుంటారన్న టాక్ రెండు పార్టీల్లో వినపడుతుంది. తెలంగాణలో 2023లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు జగన్ సహకారం ఎంతో అవసరం. తాను తెలంగాణలో పార్టీని మూసేశామని ఇప్పటికే వైసీీపీ నేతలు ప్రకటించారు. అయితే వైఎస్ షర్మిల పార్టీ పెట్టారు. అయినా కూడా ఎంతమాత్రం సహకరించకూడదని నిర్ణయించారు.

షర్మిల పార్టీ పెట్టినా….

ఇది పరోక్షంగా కేసీఆర్ కు సహకరించినట్లేనని అంటున్నారు. వైఎస్ షర్మిల కేసీఆర్, కేటీఆర్ ఆయనప్రభుత్వాన్ని ఎన్ని విమర్శలు చేస్తున్నా టీఆర్ఎస్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆమెను లైట్ గానే తీసుకుంటున్నారు. కేసీఆర్ మూడోసారి విజయం సాధించాలంటే పరోక్షంగా జగన్ సహకారం అవసరం ఉంటుంది. చంద్రబాబు ఎటూ ఏదో ఒక పార్టీతో కలిసి తనను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాడని కేసీఆర్ కు తెలుసు. అందుకే జగన్ తో రాజకీయంగా సఖ్యతనే కోరుకుంటారు.

ఏపీ ఎన్నికలలోనూ…

ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలోనూ పరోక్షంగా జగన్ కు కేసీఆర్ సహకారం అవసరం. కేసీఆర్ ప్రభావం ఏపీలో కొంత ఉండే అవకాశముంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇద్దరూ యుద్దమే చేస్తున్నా, రాజకీయాలకు వచ్చేసరికి కేసీఆర్, జగన్ లు ఒక్కటవుతారన్నది వాస్తవం. ఇద్దరి ఉమ్మడి శత్రువు చంద్రబాబు కాబట్టి వచ్చే ఎన్నికలకు ఇద్దరూ పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకోనున్నారు.

Tags:    

Similar News