ఎమోషన్ లో జగన్…ఎందుకో…?

జగన్ అన్న మనిషిని నిండు కుండ అని ఎవరైనా అంటారు. ఆయన తండ్రి చనిపోయిన నాటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు [more]

Update: 2021-01-07 13:30 GMT

జగన్ అన్న మనిషిని నిండు కుండ అని ఎవరైనా అంటారు. ఆయన తండ్రి చనిపోయిన నాటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు పడనన్ని అవమానాలు భరించారు. ప్రత్యర్ధుల నుంచి ఆయన తిన్నన్ని తిట్లు ఎవరూ తినలేదు కూడా. అయినా ఎక్కడా ఆయన తన మనసులోని భావాలను బయటపెట్టుకోలేదు. బేలతనాన్ని కూడా చూపించలేదు. 2014 ఎన్నికల‌లో తృటిలో అధికారం తప్పిపోయినా కూడా జగన్ చిరునవ్వుతోనే మీడియా ముందుకు వచ్చారు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకున్నారు. అదే జరిగింది కూడా. కానీ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం జగన్ లోపలి మనిషి అపుడపుడు బయటకు వస్తున్నాడు.

సమస్యలతోనే సావాసం…

జగన్ సీఎం అయ్యాక చేయాల్సినవి చాలానే ఉన్నాయనుకున్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం ఆయనకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. కోర్టు కేసులను ప్రతిపక్షాలు వేసి మరీ కధ ముందుకు సాగకుండా చేస్తున్నారు. అంతే కాదు కొన్ని కీలక నిర్ణయాలలో జగన్ ఏమీ కాని వానిగా జనం ముందు నిలబడాల్సివస్తోంది. ఇంకో వైపు చూస్తే ఏపీకి ఆదాయం అంతంతమాత్రంగా ఉంది. కరోనా కూడా పడగ విప్పి ఒక క్యాలండర్ ఇయర్ ని మింగేసింది. ఇంకో వైపు జమిలి ఎన్నికలు అంటున్నారు. దాంతో జగన్ అభివృద్ధి విషయంలో ఏమీ చేయకుండానే ఎన్నికలకు వెళ్తానా అన్న టెన్షన్ లో ఉన్నట్లుగా ప్రచారం అయితే ఉంది.

దేవుడే ఉన్నాడుగా….?

జగన్ తనను అక్రమంగా జైలు పాలు చేసి విపక్షాలు వేధించినపుడు నాడు సభల్లో చెప్పిన మాట ఇదే. దేవుడు ఉన్నాడు. అన్నీ చూస్తున్నాడు. ప్రత్యర్ధులకు తగిన గుణపాఠం చెబుతాడు అని. జగన్ నిజంగా కష్టాల్లో ఉంటే దేవుడి ప్రస్థావనను తీసుకువస్తారు. ఇక ముఖ్యమంత్రి అయ్యాక ఇన్ని నెలల తరువాత జగన్ దేవుడు ఉన్నాడు అంటున్నారు. ఆయన పదే పదే ఈ మాట చెబుతున్నాడు. తాజాగా విజయనగరం సభలో జగన్ దేవుడు కరుణిస్తే అందరికీ న్యాయం చేస్తామని అంటూ ఎమోషన్ అయ్యారు. నిజంగా జగన్ ఎందుకు ఇంతలా భావోద్వేగం చెందారా అన్న‌ చర్చ అయితే వస్తోంది.

చిచ్చు పెడుతున్నారుగా…?

జగన్ కి దైవ భక్తి మెండు. ఏ రాజకీయ నాయకుడూ ప్రస్థావించని విధంగా ఆయన తన రాజకీయ సభల్లో దేవుడి గురించి తరచూ తెచ్చి మాట్లాడుతూంటారు. ఆయన క్రిస్టియన్ మతాన్నే నమ్మవచ్చు కానీ అన్ని మతాలను గౌరవిస్తారు. దేవుడు ఉన్నాడు అన్న ఆస్థికుడు జగన్. అటువంటి జగన్ మీద హిందూ మత వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ అన్ని పార్టీలు విమర్శలు చేస్తూంటే బాధ కలిగి ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలోని ‌ ప్రార్ధనా మందిరాల్లో వరసగా జరుగుతున్న దాడులు ముఖ్యమంత్రిగా జగన్ కి ఒక సవాల్ గా మారాయి. అదే సమయంలో కొన్ని పార్టీలు మతం కార్డు ని తీయడం కూడా జగన్ కి ఇబ్బందిపెట్టే అంశమే. నాడు కృష్ణా పుష్కరాల సందర్బంగా అకారణంగా వందకు పైగా దేవాలయాలను నేలమట్టం చేసిన వారు కూడా ఇపుడు దేవుడి గురించి మాట్లాడుతూంటే వైసీపీ అధినేతకు బాధ కలగదా అని ఆ పార్టీలో వినిపిస్తున్న మాట. మరి జగన్ దేవుడిని నమ్ముకునే ఇంతదాకా రాజకీయాల్లో ముందుకు వచ్చారు. మరి ఇపుడు కూడా దేవుడు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు అంటున్నారు. ఆ విధంగా ఆయన తాను జనాలకు మంచి చేసే శక్తి ఆయన ఇవ్వాలని కోరుతున్నారు. చూడాలి మరి దేవుడు ఈ కధను ఏ మలుపు తిప్పుతారో.

Tags:    

Similar News