ఆయన కడతారు..ఈయన కూలుస్తారు.. కూలిస్తే.. కడతారు

ఆయన కడతారు.. ఈయన కూలుస్తారు. ఆయన కూలుస్తారు. ఈయన కడతారు. ఇదీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితి. చంద్రబాబు ఆనవాళ్లు లేకుండా చేయాలని జగన్ తొలి రోజు [more]

Update: 2021-01-08 12:30 GMT

ఆయన కడతారు.. ఈయన కూలుస్తారు. ఆయన కూలుస్తారు. ఈయన కడతారు. ఇదీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితి. చంద్రబాబు ఆనవాళ్లు లేకుండా చేయాలని జగన్ తొలి రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తున్నారు. ప్రజా ధనంతో ముడిపడి ఉన్న వాటిపై కూడా జగన్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

జగన్ సీఎం పదవి చేపట్టాక….

ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలుతు కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేశారు. దీనిపై జగన్ విమర్శలను ఎదుర్కొనాల్సి వచ్చింది. నిబంధలనకు వ్యతిరేకంగా నిర్మించారంటూ ఆ కట్టడాన్ని కూల్చివేశారు. అది తాత్కాలిక కట్టడమైనా దానిని ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చన్నది మేధావుల అభిప్రాయం. అయినా ప్రజా వేదికను జగన్ కూల్చివేశారు. ప్రధాన కారణం చంద్రబాబు హయాంలో నిర్మించడమే.

ఆలయాల పునర్నిర్మాణం…..

ఇక తాజాగా చంద్రబాబు కూల్చిన ఆలయాల పునర్నిర్మాణాలకు జగన్ నడుంబిగించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత విజయవాడలో అనేక ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. పైగా పుష్కరాల టైంలో ఎక్కువ రద్దీ ఉంటుందని అప్పట్లో చంద్రబాబు విజయవాడలో రోడ్లపైన, ఇరువైపులా ఉన్న దేవాలయాలను కూల్చివేశారు. ఆనాడు ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు లెక్క చేయలేదు. అభివృద్ధి కోసమే తాను ఆలయాలను తొలగించి వేరే చోట నిర్మించాలనుకుంటున్నాని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు.

మత విశ్వాసం కన్నా…..

కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మత సామరస్యం దెబ్బతినడం, ఆలయాలపై వరస దాడులు జరుగుతుండటంతో జగన్ చంద్రబాబు కూల్చి వేసిన ఆలయాలను పునర్నిర్మించే పనిలో పడ్దారు. దాదాపు ఐదు ఆలయాల పునర్నిర్మాణ పనులు జగన్ స్వయంగా ప్రారంభించారు. దుర్గగుడి అభివృద్ధికి జగన్ 70 కోట్ల నిధులను కేటాయించారు. ఇలా చంద్రబాబు కడితే జగన్ కూల్చివేయడం, ఆయన కూల్చివేస్తే జగన్ పునర్మించడం ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికరంగా మారింది. ఏపీలో రెండు పార్టీలు మతవిశ్వాసాలపై కన్నా రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఆశిస్తుండటమే ఇందుకు కారణం.

Tags:    

Similar News