గేమ్ ఛేంజర్స్ వస్తున్నారట …?
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ప్రభావితం చేస్తున్న నేతలు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్. మరోకరు తాజాగా ఎమ్యెల్సీ అయిన తోట త్రిమూర్తులు. వీరిద్దరికి వచ్చే [more]
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ప్రభావితం చేస్తున్న నేతలు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్. మరోకరు తాజాగా ఎమ్యెల్సీ అయిన తోట త్రిమూర్తులు. వీరిద్దరికి వచ్చే [more]
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ప్రభావితం చేస్తున్న నేతలు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్. మరోకరు తాజాగా ఎమ్యెల్సీ అయిన తోట త్రిమూర్తులు. వీరిద్దరికి వచ్చే టర్మ్ లో ఇక వయసు రీత్యా ఛాన్స్ లేదనే టాక్ వినిపిస్తుంది. అందుకే వీరి తనయులకు జగన్ టిక్ పెట్టడం ఖాయమంటున్నారు ఆ పార్టీ వర్గాలు. ప్రత్యక్ష రాజకీయాల్లో దశాబ్దాలుగా రాజ్యమేలిన వీరిద్దరి కుమారులు ప్రస్తుతం అందిరావడంతో త్వరలోనే వారి వారసులు రంగ ప్రవేశం చేయడం తధ్యమంటున్నారు.
పిల్లి సూర్యప్రకాష్ కే …
రాజకీయంగా అన్ని ఉన్నత స్థానాలను అందుకున్న పిల్లి సుభాష్ చంద్ర బోస్ వైఎస్ జగన్ కి అత్యంత విధేయుడు. వైఎస్ కుటుంబంతో మమేకం అయిన నేతల్లో బోస్ మొదటి వరుసలో నిలుస్తారు. ఆయనను మంత్రి పదవికి రాజీనామా చేయించి రాజ్యసభకు పంపారు జగన్. ఇక ఆయనకు రిటైర్మెంట్ వయసు వచ్చేసింది. బోస్ కి ఇదే లాస్ట్ ఛాన్స్. పిల్లి బోస్ తో జనరేషన్ గ్యాప్ ఉండటంతో వచ్చే ఎన్నికలకు ఆయన తనయుడు సూర్యప్రకాష్ ను జగన్ బరిలోకి దింపుతారని తెలుస్తుంది. అది రామచంద్రాపురం నుంచా లేక మండపేట నుంచా లేకా మరో నియోజకవర్గం నుంచా అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. వీలయితే రాజమండ్రి రూరల్ నుంచి కూడా బోస్ తనయుడికి ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి అత్యధిక ఓట్లు ఉన్న రాజమండ్రి టూ కూడా బోస్ తనయుడికి అనుకూలంగానే ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.
తోట పృథ్వి కి ఛాన్స్ .. ?
మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్యెల్సీ ఇచ్చి కాపు సామాజిక వర్గానికి వైసిపి లో సముచిత స్థానం ఉంటుందని చాటిన జగన్ ఆయన కుమారుడికి కాకినాడ ఎంపి టికెట్ ఇవ్వనున్నారనిప్రచారం నడుస్తుంది. తోటకు ఇటీవలే ఎమ్యెల్సీ ఇచ్చిన జగన్ దానితో సరిపెట్టబోరని ఆయన కుమారుడికి కాకినాడ ఎంపి టికెట్ కి ఛాన్స్ ఉందని వినిపిస్తుంది. తోట కుమారుడు పృథ్వి రాజ్ కి రాజకీయ భవిష్యత్తు కల్పించడం ద్వారా ఆ కుటుంబం వైసిపి తోనే దీర్ఘ కాలం పనిచేసేలా జగన్ వ్యూహం వుండబోతుందన్నచర్చ ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గంలో తోటకు గట్టి ఇమేజ్ ఉంది. అదే విధంగా జనసేన కారణంగా ఆ ఓటు బ్యాంక్ దూరం కాకుండా జగన్ గట్టి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. తన జనరేషన్ తో కలిసి నడిచేవారిని ఎంపిక చేసుకోవడంలో ఇప్పటికే ఆలోచన చేసుకుంటున్న జగన్ యువకుల టీం తో ముందుకు వెళ్లాలన్న ఆలోచన ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.