జగన్ ఫీడ్ బ్యాక్ కోసమే.. అలెర్ట్ అయ్యారట
పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ జనంలోకి వచ్చేశారు. ఆయన ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలు అంటూ తెలంగాణా అంతటా కలియతిరిగేస్తున్నారు. కేసీయార్ ఫాం హౌస్ అన్న విమర్శలకు చెక్ పెడుతూ [more]
పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ జనంలోకి వచ్చేశారు. ఆయన ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలు అంటూ తెలంగాణా అంతటా కలియతిరిగేస్తున్నారు. కేసీయార్ ఫాం హౌస్ అన్న విమర్శలకు చెక్ పెడుతూ [more]
పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ జనంలోకి వచ్చేశారు. ఆయన ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలు అంటూ తెలంగాణా అంతటా కలియతిరిగేస్తున్నారు. కేసీయార్ ఫాం హౌస్ అన్న విమర్శలకు చెక్ పెడుతూ ఏడు పదుల దగ్గర వయసులో కేసీఆర్ చమటోడుస్తున్నారు. ఎందువల్ల అంటే సమాధానం సులువే. తెలంగాణా పొలిటికల్ లెక్కల్లో తేడాలు వచ్చేశాయి. అటూ ఇటూ రెండు జాతీయ పార్టీలు మోహరించి ఉన్నాయి. అవి తమ కత్తులను పదును పెడుతున్నాయి. చాన్స్ దొరికితే చాలు టీయారెస్ అధికారం కుత్తుక కత్తిరించేందుకు తెగ ఉబలాటపడుతున్నాయి. దాంతోనే కేసీయార్ కరోనా వేళ కూడా రోడ్డున పడ్డారు అంటున్నారు.
అలెర్ట్ అయిన జగన్….
ఇక ఏపీలో జగన్ మీద ఒక విమర్శ ఉంది. జగన్ కేరాఫ్ తాడేపల్లి ప్యాలెస్ అని. కరోనా వేళ కూడా కాలు బయటపెట్టకుండా జగన్ పాలించాడు అంటూ ఇప్పటికీ టీడీపీ దుమ్మెత్తిపోస్తోంది. మరో వైపు అధికార యంత్రాంగాన్ని మాత్రమే నమ్ముతూ వారితోనే పాలన సాగిస్తూ జగన్ చంద్రబాబుని మరపించేస్తున్నారు. మంత్రులు ఉత్సవ విగ్రహాలు అయిపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమైపోయారో ఎవరికీ ఎరుక అంటున్నారు. ఇక వైసీపీ పార్టీ అన్నదాన్ని చంపి వైసీపీ సర్కార్ పుట్టిందని కూడా పార్టీ అభిమానులు వెటకారంగా అంటున్నారు. ఒక విధంగా చూస్తే జగన్ అధికారులు పోలీసులు ఇదే ఏపీలో పాలన అన్నట్లుగా కనిపిస్తోంది. ఈ భావన మరింత ముదరక ముందే జగన్ అలెర్ట్ అవుతున్నారు అంటున్నారు.
వారంలో రెండు రోజులు …
ఏపీలో జగన్ జనాల్లోకి రావడానికి రెడీ అవుతున్నారు. కరోనా కాస్తా తగ్గాక వారంలో రెండు రోజుల పాటు జిల్లాల టూర్ కి ఆయన డిసైడ్ అయిపోయారు. జిల్లాలకు వెళ్ళి తన పాలన గురించి తెలుసుకోవడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు తన మానసపుత్రికలు అయిన సచివాలయాలను కూడా జగన్ సందర్శిస్తారు అంటున్నారు. వాటి నుంచే సంక్షేమ ఫలాలు నేరుగా జనాల వద్దకు చేరుతున్నాయి కాబట్టి వాటి లోటు పాట్లను ఆయన నేరుగా తెలుసుకోనున్నారు. ఇక జనాల నుంచి వచ్చే స్పందను కూడా ప్రత్యక్షంగా చూడాలని ఉబలాటపడుతున్నారుట. మొత్తానికి జగన్ లో మార్పు వచ్చింది అంటున్నారు.
చెక్ చెప్పాలనే …
కరోనా కొంత తగ్గడంతో ప్రధాన ప్రతిపక్షం ఏపీలో హడావుడి చేస్తోంది. చంద్రబాబు కూడా సాధన దీక్ష చేపట్టారు. టీడీపీ క్యాడర్ కూడా ఇపుడు యాక్టివ్ అవుతోంది. మరో వైపు జనసేన కూడా జనాల్లోకి వస్తోంది. విపక్షాలు కనుక ఒక్కసారి గేరు మార్చి జోరు పెంచాయి అంటే కచ్చితంగా ప్రజాభిప్రాయన్ని మార్చేందుకు ఆస్కారం ఉంటుంది అని జగన్ గట్టిగా భావిస్తున్నారు. మరో వైపు ఎన్ని పధకాలు అమలు చేస్తున్నా కూడా జనాల్లో తెలియని అసంతృప్తి ఉందని కూడా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకోవైపు అభివృద్ధి అన్నది లేదు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం జగన్ కి సరైన ఫీడ్ బ్యాక్ రావడం లేదు. అందువల్లనే ఆయన జిల్లా టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు అంటున్నారు. చూడాలి మరి జగన్ జనంలోకి వస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో.