ఇప్పుడు బాధపడి ఏం లాభం?
గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడం అంటే ఇదే. జగన్ కు ఇదే ఎక్కువగా కిక్ ఇస్తున్నట్లు కనపడుతుంది. సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ విషయంలో [more]
;
గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడం అంటే ఇదే. జగన్ కు ఇదే ఎక్కువగా కిక్ ఇస్తున్నట్లు కనపడుతుంది. సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ విషయంలో [more]
గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడం అంటే ఇదే. జగన్ కు ఇదే ఎక్కువగా కిక్ ఇస్తున్నట్లు కనపడుతుంది. సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ విషయంలో చేసిన వ్యాఖ్యల్లో నిజముందనిపిస్తుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాల్సిన ప్రయాణాన్ని జగన్ కావాలని కుదుపులు తెచ్చుకుంటున్నారు. బ్రేకులు వేసుకుంటున్నారు. ఇవన్నీ జగన్ కు పెద్ద విషయాలుగా కన్పించక పోవచ్చు కాని ప్రజల్లో నోళ్లలో మాత్రం నానుతున్నాయి. ఒక్కసారి జగన్ మాట్లాడితే సెట్ అయిపోయే విషయాలను గోరంతది కొండంత చేసుకుంటున్నారు. కోతిపుండు బ్రహ్మరాక్షసి సామెతను జగన్ గుర్తకు తెప్పిస్తున్నారు.
స్మూత్ గా వెళుతున్న….
నిజానికి జగన్ కు ఎటువంటి సమస్య లేదు. ప్రజలు ఫుల్లుగా అధికారం ఇచ్చారు. సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారు. పార్టీలో తానే మోనార్క్. తాను చెప్పినట్లే అంతా నడిచిపోతుంది. విపక్షాలు సయితం ఏమంత బలంగా లేవు. జగన్ ది చాలా చిన్నవయసు. చంద్రబాబు అనంతరం జగన్ కు సరైన ప్రత్యర్థే ఉండరు. ఇప్పుడే తన ఓటు బ్యాంకును పటిష్టం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జగన్ తెచ్చి పెట్టుకున్న సమస్యలు ఆయననే ఇబ్బంది పెడుతున్నాయి. ప్రధానంగా రఘురామ కృష్ణరాజు అంశం రోజురోజుకూ జటిలం కానుంది. పార్లమెంటు సమావేశాల్లో ఇది జగన్ కు చిక్కులు తెచ్చిపెట్టనుంది.
పట్టుదలకు పోయి….
రఘురామ కృష్ణరాజు విషయంలో జగన్ మరీ పట్టుదలకు వెళ్లారు. ఆయన అనేక సార్లు తన సమస్యలను, తనకు పార్టీ పరంగా ఎదురవుతున్న అవమానాల గురించి చెప్పుకోదలచుకున్నారు. జగన్ అపాయింట్ మెంట్ ను అనేక సార్లు అడిగారు. ఒక్కసారి జగన్ రఘురామ కృష్ణరాజుకు అపాయింట్ మెంట్ ఇచ్చి ఉంటే ఈ సమస్య ఇంతదూరం వచ్చేది కాదు. జగన్ ఒక్క నవ్వు నవ్వి భుజం మీద తడితే రఘురామ కృష్ణరాజు పూర్తిగా మెత్తబడిపోయేవారు. కానీ పట్టుదలకుపోయి ఆయనను అరెస్ట్ చేయించడంతోనే ఆయన మరింత రెచ్చిపోవడం, ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం వంటివి జరిగాయి. ఇప్పుడు పార్లమెంటులో ఈ విషయం చర్చకు వచ్చి ఎంపీలు రఘురామను సమర్థిస్తే జగన్ పరువు జాతీయ స్థాయిలో మరింత దిగజారుతుంది.
షర్మిల విషయంలో….
ఇక తన సొంత చెల్లెలు షర్మిల విషయంలోనూ జగన్ అదే తప్పు చేసినట్లు అనిపిస్తుంది. తన విజయం కోసం అహర్నిశలూ శ్రమించిన చెల్లెలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎలాంటి పదవి ఇచ్చినా ఎవరూ అభ్యంతరం తెలపరు. షర్మిల ఏ పదవికైనా అర్హురాలే. అయితే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ 2 అన్న శబ్దాన్ని వినపడటం జగన్ కు ఇష్టం లేదు. షర్మిలకు పదవి ఇస్తే మరో అధికారిక కేంద్రం ఏర్పడుతుందని అనుమానించారు. అందుకే షర్మిలను దూరంగా పెట్టారు. ఆమెను పిలిచి ఒకసారి జగన్ మాట్లాడి ఉంటే కుటుంబ సమస్యలు వీధికెక్కేవి కావు. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన విషయాలు అక్షర సత్యాలు. జగన్ ఒక మెట్టు దిగి ఉంటే ప్రశాంతంగా పాలన చేసుకుని ఉండేవారు. కేవలం ఇగోలతోనే ఈ ఇబ్బందులను జగన్ కొని తెచ్చుకున్నారు.