రాజకీయ ఉపాధి మాత్రమే… అసలు విషయం లేదట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. 135 మందికి రాజకీయ ఉపాధి కల్పించారు. అన్ని [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. 135 మందికి రాజకీయ ఉపాధి కల్పించారు. అన్ని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. 135 మందికి రాజకీయ ఉపాధి కల్పించారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ పార్టీని నమ్ముకున్న వారికి పదవులిచ్చారు. సరే. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ వీరందరికీ రాజకీయంగా పదవులు లిచ్చారు. కానీ ఆర్థికపరమైన ప్రయోజనాలు అందుతాయా? లేదా? అన్నదే ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే వీరందరికీ గౌరవ వేతనం ఇవ్వడమూ కష్టమేనంటున్నారు.
ఆర్థిక పరిస్థితి….?
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఈ జగన్ సమయంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడంపై అధికారుల నుంచి పెదవి విరుపులే విన్పిస్తున్నాయి. అయితే రాజకీయ పదవులు కాబట్టి నిధులు విడుదల చేయకపోయినా పెద్దగా సమస్య తలెత్తదని ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో కొంత స్థిమిత పడ్డారు. నిజానికి 135 కార్పొరేషన్ల చైర్మన్ల ఆఫీసు మెయిన్ టెయిన్స్, వాహనాలు, గౌరవ వేతనం వంటి వాటితో నెలకు దాదాపు రెండు కోట్ల రూపాయల పైగానే బారం పడుతుంది.
బీసీ కులాలు….
ఇంతకు ముందే బీసీ కులాలకు చెందిన దాదాపు 56 కార్పొరేషన్లను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారందరికీ ఇప్పటి వరకూ వాహనం లేదు. కనీసం ఆఫీసులో సరైన సౌకర్యాలు కూడా లేవు. ఈ కార్పొరేషన్లకు ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులు కూడా విడుదల కూడా ఇంతవరకూ విడుదల చేయకపోవడంతో వారంతా అసంతృప్తిగా ఉన్నారు. ఎవరిని అడగాలో తెలియక తమ జిల్లా మంత్రుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. అయినా ఫలితం లేదు.
మంత్రులపై వత్తిడి….
ఇప్పుడు మళ్లీ 135 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడంతో పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా మంత్రులపై వత్తిడి పెరుగుతుందంటున్నారు. ఈ కార్పొరేషన్లలో ఆర్టీసీ, వీజీటీఎం, ఏపీఐఐసీ లాంటివి కొన్ని మినహాయించి మిగిలిన పోస్టులన్నీ అలంకార ప్రాయమే. మిగిలిన వాటికి నిధులు కూడా అందవు. వీరంతా బోర్డు తగిలించుకుని తిరగడమే తప్ప ఖర్చులు కూడా సొంతంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి అన్న కామెంట్స్ పార్టీ నుంచే వినపడుతున్నాయి.