జగన్ ఆ పదవులను వారికి రిజర్వ్ చేశారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమైన, నమ్మకమైన నేతలకు పదవులను ఇస్తూ పోతున్నారు. అయితే మరో నాలుగు కీలక పదవులను మాత్రం [more]

;

Update: 2021-09-04 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమైన, నమ్మకమైన నేతలకు పదవులను ఇస్తూ పోతున్నారు. అయితే మరో నాలుగు కీలక పదవులను మాత్రం జగన్ రిజర్వ్ లో ఉంచారు. ఇటీవల 135 నామినేటెడ్ పోస్టులను జగన్ భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మాజీ ఎమ్మెల్యేలకు, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన వారికి, పార్టీ కోసం కష్టపడిన నేతలకు మాత్రమే జగన్ పదవులను ఇచ్చారు.

ఎమ్మెల్యేలకు…

ఎమ్మెల్యేలకు మాత్రం ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. కొందరు ఎమ్మెల్యేలకు ఉన్న నామినేటెడ్ పోస్టులను కూడా తొలగించారు. అయితే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవులు దక్కని వారి కోసం కొన్ని రిజర్వ్ లో ఉంచారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రాంతీయ అభివృద్ది మండళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే జిల్లాల పెంపుదల ఉండటంతో దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జిల్లాల పునర్విభజన పూర్తయిన వెంటనే ప్రాంతీయ మండళ్లు ఏర్పాటవుతాయి.

ప్రాంతీయ మండళ్లు….

ఈ మేరకు దీనిపై పూర్తి స్థాయి కసరత్తు చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తం నలుగు జోన్లను ఏర్పాటు చేయనున్నారు. విజయనగరం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక ప్రాంతీయ అభివృద్ధి మండలి, కాకినాడ కేంద్రంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలు, కడప కేంద్రంగా చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి కాలపరిమితిని మూడేళ్లు గా నిర్ణయించారు.

మంత్రి పదవులు దక్కని….

మంత్రి వర్గ విస్తరణలో పదవులు దక్కని సీనియర్ నేతలకు ఈ పదవులు అప్పగించాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. సామాజికవర్గాల వారీగా ఈ పదవులను భర్తీ చేస్తారట. ఈ పదవి కేబినెట్ ర్యాంకు కావడంతో ఎమ్మెల్యేలు కూడా సంతృప్తి చెందుతారని జగన్ భావిస్తున్నారు. జిల్లాల విభజన తేలితే తప్ప ఈ పదవులను భర్తీ చేయడానికి వీలు కాదు. అందుకే జిల్లాల పెంపుదలపై జగన్ దృష్టి పెట్టినట్లు తెలిసింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తానని జగన్ ఇచ్చిన హామీ మేరకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

Tags:    

Similar News