ఎమ్మెల్యేలకు ఒక్క మాట చెప్పేది లేదా?

నామినేటెడ్ పోస్టులను జగన్ పెద్దయెత్తున భర్తీ చేశారు. అయితే ఇందులో అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే ఎంపిక జరిగిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. గతంలోనూ జగన్ ఇదే [more]

;

Update: 2021-08-05 06:30 GMT

నామినేటెడ్ పోస్టులను జగన్ పెద్దయెత్తున భర్తీ చేశారు. అయితే ఇందులో అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే ఎంపిక జరిగిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. గతంలోనూ జగన్ ఇదే తీరుగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్ ల ఎంపిక జరిగింది. ఇందులో కూడా ఎమ్మెల్యేలకు కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా తమకు అందిన ఫీడ్ బ్యాక్ ప్రకారం జగన్ పంచిపెట్టారు.

నామినేటెడ్ పోస్టులలో…..

తాజాగా జరిగిన నామినేటెడ్ పోస్టుల్లోనూ జగన్ ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్న వారికి పదవులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. గతంలోనూ నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజాకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపుకు బీసీ కార్పొరేషన్ లోని ఒక కులం పదవిని అప్పగించారు. దీనిపై రోజా ఆగ్రహం వ్యక్తం చేసినా మంత్రి వర్గ విస్తరణ ఉన్నందున సర్దుకుపోయారంటారు.

సిఫార్సు చేసినా…?

నామినేటెడ్ పోస్టులు పెద్దయెత్తున భర్తీ చేస్తారన్న చర్చ గత కొంతకాలంగా జరుగుతుంది. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులపై వత్తిడి పెరిగింది. తమ పేర్లు సిఫార్సు చేయాలంటూ అనేక మంది క్యూ కట్టారు. నిజానికి ఆ నియోజకవర్గంలో పార్టీ కోసం ఎవరు పనిచేశారు? ఎవరు షో చేశారు? అన్నది స్థానిక ఎమ్మెల్యేకే అవగాహన ఉంటుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు సిఫార్సు కూడా చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లబించకపోతే వచ్చే ఎన్నికల్లో వారి సహకారం దొరకదు. ఈ విషయాన్ని జగన్ విస్మరించారని ఎమ్మెల్యేలు మదనపడుతున్నారు.

పెద్దలు చెప్పిన వారికే…?

నెల్లూరు జిల్లాలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయంతోనే కొందరికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి. ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే పోస్టులను భర్తీ చేయడంతో వారు గుర్రుగా ఉన్నారు. మరోవైపు అనేక నియోజకవర్గాల్లో తమకు పోస్టులు దక్కలేదని ఎమ్మెల్యేలను నేతలు ఎక్కిదిగుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఏం చేయాలో పాలుపోవడం లేదు. జగన్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఎమ్మెల్యేలను ఇబ్బందిపెడుతున్నాయి.

Tags:    

Similar News