ఇదే ఫార్ములా.. అక్కడ కూడా అప్ల‌య్ అవుతుందా..?

ప్ర‌స్తుతం వైసీపీలో జ‌రిగిన నామినేటెడ్ ప‌ద‌వుల పందేరాన్ని గ‌మ‌నించిన వారు.. ఇదే ప్ర‌శ్న సంధిస్తున్నారు. నామినేటెడ్ ప‌ద‌వుల్లో.. 55 శాతం మహిళ‌ల‌కు కేటాయించారు. అనేక ప‌ద‌వుల‌ను మ‌హిళ‌ల‌కు [more]

;

Update: 2021-09-04 02:00 GMT

ప్ర‌స్తుతం వైసీపీలో జ‌రిగిన నామినేటెడ్ ప‌ద‌వుల పందేరాన్ని గ‌మ‌నించిన వారు.. ఇదే ప్ర‌శ్న సంధిస్తున్నారు. నామినేటెడ్ ప‌ద‌వుల్లో.. 55 శాతం మహిళ‌ల‌కు కేటాయించారు. అనేక ప‌ద‌వుల‌ను మ‌హిళ‌ల‌కు ఇచ్చారు. నిజానికి వీరిలో చాలా మంది.. పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌నివారు కూడా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ + మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద‌పీట వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి.. మ‌హిళల‌కు అవ‌కాశం క‌ల్పించారు. దీంతో పెద్ద ఎత్తున మ‌హిళ‌ల‌కు అవ‌కాశం చిక్కింది. మ‌రి ఇదే ఫార్ములాను మంత్రి వ‌ర్గంలోనూ అమ‌లు చేస్తారా ? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

కొత్త వారిలో..?

మ‌రి కొద్ది నెల‌ల్లోనే జగన్ కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఉంటుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. దాదాపు 90 శాతం మంది మంత్రుల‌ను త‌ప్పించి కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. అయితే.. వీరిలో 55 శాతం మంది మ‌హిళ‌ల‌కు ఇస్తారా? అనేది ప్ర‌శ్న‌. గ‌త కేబినెట్ కూర్పులో 33 శాతం మంత్రి ప‌ద‌వుల‌ను మ‌హిళ‌ల‌కు ఇచ్చామ‌ని.. జ‌గ‌న్ చెప్పారు. అయితే..గ తంలో చంద్ర‌బాబు హ‌యాంలోనూ ఇదే ఫార్ములాను అనుస‌రించి.. ముగ్గురు మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. కానీ, వారిలో అగ్ర‌వ‌ర్ణ మ‌హిళ‌లు కూడా ఉన్నారు. కానీ, జ‌గ‌న్ అగ్ర‌వ‌ర్ణ మ‌హిళా నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టి.. ఎస్సీ, ఎస్టీల‌కు పెద్ద‌పీట వేశారు.

ఓసీలు లేరే?

జ‌గ‌న్ కేబినెట్లో ఉన్న మ‌హిళా మంత్రుల్లో ఓసీ మంత్రులు లేరు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. చంద్ర‌బాబుకు, జ‌గ‌న్‌కు పెద్ద‌గా తేడా అయితే క‌నిపించ‌లేదు. కానీ, ఇప్పుడు నామినేటెడ్ స‌హా.. స్థానిక సంస్థ‌ల ప‌ద‌వుల్లో.. మ‌హిళ‌ల‌కు భారీ ఎత్తున కోటా పెంచిన జ‌గ‌న్‌.. మంత్రి వ‌ర్గంలోనూ చంద్ర‌బాబును మించిన రీతిలో 55శాతం ఇస్తే.. బాగుంటుంద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇది సాధ్య‌మేనా ? అనేది కూడా ప్ర‌శ్న‌. ఎందుకంటే.. 55 శాతం అంటే.. క‌నీసం 12 మందిని మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవాలి.

అంతమందికి..?

అంత‌మంది మ‌హిళ‌లు కూడా వైసీపీలో ఎమ్మెల్యేలుగా లేరు. ఉన్నా జగన్ కు ఇచ్చే అవ‌కాశం లేదు. ఎందుకంటే.. పురుష ఎమ్మెల్యేలు, సీనియ‌ర్లు చాలా మంది ఉన్నారు. మహిళలకు ఇవ్వాలనుకున్నా అనేక జిల్లాల్లో ప్రయారిటీలు మారిపోతాయి. సీనియర్ నేతలు కూడా సైడై పోవాల్సి వస్తుంది. పార్టీని నమ్ముకున్న నేతలకు కూడా అన్యాయం జరుగుతుంది. సో.. 55 శాతం ఫార్ములా..కేవ‌లం నామినేటెడ్‌కే ప‌రిమితం అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News