జగన్ ని ఫేస్ చేసే దమ్ము లేదా… ?

రాజకీయాలు అంటే ఎన్నో వ్యూహాలు ఉంటాయి. అయితే వాటిని ప్రయోగించేటపుడు కొన్ని విలువలూ మర్యాదలూ కూడా ఉంటాయి. అల్టిమేట్ గా జనాదరణ పొందడం అధికారంలోకి రావడమే ప్రజాస్వామ్యంలో [more]

Update: 2021-07-22 08:00 GMT

రాజకీయాలు అంటే ఎన్నో వ్యూహాలు ఉంటాయి. అయితే వాటిని ప్రయోగించేటపుడు కొన్ని విలువలూ మర్యాదలూ కూడా ఉంటాయి. అల్టిమేట్ గా జనాదరణ పొందడం అధికారంలోకి రావడమే ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేయాల్సిన పని. గతంలో అయితే తాము చేసిన మంచి పనులు చెప్పి నాయకులు అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసేవారు. ఆ తరువాత కాలంలో చూసుకుంటే తమ వైపు పాజిటివిటీ కంటే అవతల పార్టీ నెగిటివిటీని పెద్దగా ప్రచారం చేసి అధికారంలోకి రావడం జరుగుతూ వస్తోంది. ఇదిపుడు ఇంకా పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది.

ఎలిమినేట్ చేయడమే..?

యుద్ధంలో సమరనీతి ఉంటుంది. నిరాయుధుడిని కొట్టకూడదు అంటారు, అలాగే అవతల వారు తయారుగా లేనపుడు దొంగ దెబ్బ తీయకూడదు అని చెబుతారు. కానీ రాజకీయాల్లో అలాంటి నియామాలు ఏవీలేవు. దాంతో పరాకాష్టకు పోతున్నారు. తమ ప్రత్యర్ధిని జనంలో ఉంచి ఆయన తప్పులు చూపించి పవర్ లోకి రావడం నిన్నటి నీతి అయింది. ఇపుడు ఏకంగా వైరి పక్షం నేత సీన్ లోనే లేకుండా చేసే దారుణమైన వ్యూహాలకు ఒడికడుతున్నారు. విషయానికి వస్తే ఏపీ రాజకీయాలు దిగజారిపోయాయని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు కులాలు, రెండు కుటుంబాలు, దశాబ్దాల వైరం. ఇదే ఇపుడు ఎలాంటి పని అయినా చేయించేస్తోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

భయమేనా…?

జగన్ అధికారంలో ఉండగా తాము రాలేము అన్న భయమో బెంగో ఎక్కడో ఒక చోట ఉందేమో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తెగ కలవరపాటుకు గురి అవుతోంది. జగన్ ని జైలుకు పంపాలి అన్నదే గత పన్నెండేళ్ళుగా ఆ పార్టీ ఏకైక అజెండా అయింది. జగన్ ప్రత్యర్ధుల కోరిక్ తీర్చి పదహారు నెలలు జైలుకు వెళ్ళి వచ్చారు. బెయిల్ మీద ఆయన ఉన్నారు. ఈ దేశంలో ఆయన ఒక్కరే కాదు, చాలా మంది బెయిల్ మీద ఉన్నారు. ఆ మాటకు వస్తే స్టేల మీద ఉన్న టీడీపీ పెద్దల కధ ఏంటి అన్నది కూడా చూడాలి కదా. అర్జంటుగా జగన్ ని జైల్ కి పంపిస్తే తాము అధికారంలోకి వస్తామని ఎందుకో టీడీపీ ఒక తప్పుడు వ్యూహంతో పోతుందేమో అనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

అది కదా చేయాల్సింది …

జగన్ అయిదేళ్ల పాలన సాగనిచ్చి ఆ మీదట జనాలు ఆయన్ని వ్యతిరేకించి ఓడిస్తే దర్జాగా తెలుగుదేశం ఆధికారంలోకి రావచ్చు. దాని కోసం అయితే చాలానే చేయాలి. ఇక్కడ అధికారంలో ఉన్న వారికి అడ్వాంటేజెస్ ఉంటాయి, కాబట్టి తాము మళ్ళీ గెలవలేమేమో అన్న సందేహం ఏదో ఉండాలి. అందుకే జగన్ ఎన్నికల వేళకు జైలు లో ఉండాలి అని ఏదో స్కెచ్ లు వేస్తున్నారు. కానీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పినట్లుగా ఇక్కడే లాజిక్ మిస్ అవుతున్నారు. జగన్ జైలు లో ఉంటే మళ్లీ ఆయనే కదా గెలిచేది. ఆ రకంగా సానుభూతిని పోగు చేయడానికేనా ఇన్ని తంటాలు అంటే టీడీపీ పెద్దల దగ్గర సమాధానం ఉండదేమో. ఏది ఏమైనా అవతల పక్షాన్ని డైరెక్ట్ గా ఎదుర్కొని గెలిస్తేనే అది ఘనమైన విజయం అవుతుంది. జనాలు కూడా అలాటి సందర్భంలోనే కచ్చితమైన తీర్పు చెబుతారు. ఇంత చిన్న విషయం తెలియకనే టీడీపీ రాంగ్ రూట్ లను, షార్ట్ కట్ మెదళ్ళను ఇప్పటికీ వెతుక్కుంటోందా అన్న చర్చ అయితే ఉంది మరి

Tags:    

Similar News