జగన్ ను నమ్మించి మోసం చేశారా… ?

ఇది జగన్ మనోవేదన అంటే తప్పు కాదేమో. ఆయన బయటకు ఏనాడూ చెప్పుకోరు కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే మాట కరెక్ట్ అనిపిస్తోంది. 2019 ఎన్నికలకు [more]

;

Update: 2021-08-06 13:30 GMT

ఇది జగన్ మనోవేదన అంటే తప్పు కాదేమో. ఆయన బయటకు ఏనాడూ చెప్పుకోరు కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే మాట కరెక్ట్ అనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు జగన్ కు ఎంతో బలం బలగం ఉండేది. ఆయనకు ఇంటా బయటా ఇరుగూ పొరుగూ కూడా స్నేహితులే కనిపించే వారు. కేవలం రెండేళ్ళ వ్యవధిలో అంతా తారుమారు అయింది. రాజకీయం కూడా గందరగోళంగా మారింది. ఇదంతా జగన్ అనుభవ రాహిత్యంతో పాటు అవతల వారి రాజకీయ తెలివిడి అని కూడా చెప్పాలి. జగన్ కి ఇపుడు ఎటు చూసినా సమస్యలే తప్ప సావాసాలు అయితే లేవు అన్నది నిజం.

స్నేహ హస్తం ఏమైంది..?

జగన్ సీఎం గా ప్రమాణం చేసిన నాడు పొరుగు రాష్ట్రం నుంచి కేసేయార్ వచ్చి దీవించారు. ఆ తరువాత ఇద్దరు మధ్యన కొన్నాళ్ళు మంచి స్నేహం నడచింది. కేసీయార్ కి జగన్ మధ్య ఉన్న బంధం సుదీర్ఘమైనది. చంద్రబాబు పొడగిట్టని కేసీయార్ జగన్ ని బాగా ప్రోత్సహించారు. అయితే అందులో రాజకీయం పాళ్ళే ఎక్కువ. జగన్ కూడా అలాగే అర్ధం చేసుకుని ఉంటే ఇప్పటికీ ఈ బంధం కొనసాగేదే. కానీ జగన్ కేసీయార్ ని నిండా నమ్మారు. చివరికి తనను ఆయన మోసం చేశారని భావించి హర్ట్ అయ్యారు. ఫలితంగా తెలంగాణాతో కట్ అనేసుకున్నారు. క్రిష్ణా జలాలా విషయంలో తీసుకుంటే కేసీయార్ ని కట్టడి చేస్తున్నాను అనుకుని తన సొంత రాయల‌సీమకే గండి కొట్టుకున్నారు అన్నది నిజం.

చెల్లెమ్మ అండ లేదుగా..?

ఇక ఇంట్లో చూసుకుంటే చెల్లెమ్మ షర్మిల జగన్ కి కొండంత బలం. ఆమెతో అదే సఖ్యత కొనసాగించి ఉంటే జగన్ పార్టీ పరంగా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇపుడు ఆమె వేరు అయిపోయింది. తెలంగాణాలో తన రాజకీయం తాను చేసుకుంటోంది. ఇక ఏపీలో అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని నడపలేక జగన్ సతమతమవుతున్నారు. దీంతో షర్మిల లోటు అన్నది పార్టీకి బాగా తెలిసివస్తోంది. ఈ మధ్య జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారమే చేయకుండా వైసీపీ గెలిచి ఉండవచ్చు. అలాగే అన్ని ఎన్నికలూ ఉండవు. ఇక మీదట ఏ ఎన్నిక అయినా జగన్ వెళ్ళితీరాల్సిందే. లేకపోతే దెబ్బ పడడం ఖాయం.

మోడీతో తలాక్ …

ఇక జగన్ అధికారంలోకి రావడానికి తెర వెనక సాయం అందించిన వారిలో మోడీ ఒకరు అన్న ప్రచారం ఉంది. ఇపుడు మోడీతో కూడా ఢీ అంటోంది వైసీపీ. ఇక్కడ కూడా చూసుకుంటే జగన్ కేసీయార్ ని నమ్మినట్లుగానే మోడీని నమ్మి మోసపోయారు అని చెప్పాలి. రాజకీయాల్లో లెక్కలు ఉంటాయి కానీ నమ్మకాలు ఉండవని జగన్ కి తెలిసేసరికి ఢిల్లీ బంధం కూడా పుటుక్కున తెగిపోయింది. దాంతో కేంద్రం కూడా జగన్ ఎదురు అవుతోంది. అంటే పొరుగున కేసీయార్, ఢిల్లీలో మోడీతో ఒకేసారి పోరాడడం అంటే జగన్ కి కష్టమైన వ్యవహారమే. ఇక పడకేసిన పార్టీని కదిలించే ఇంటి ఆడపడుచు షర్మిల వైసీపీకి దూరం కావడం మరింత పెద్ద లోటు. ఏది ఏమైనా జగన్ ఒంటరి అయిపోయారు. అది కూడా కేవలం రెండేళ్ల వ్యవధిలోనే. ఇక్కడో మాట చెప్పుకోవాలి. ఏపీలో జగన్, తెలంగాణాలో కేసీయార్, ఢిల్లీలో మోడీ, ఇలా బాబుకు అందరూ శత్రువులే అని 2019 ఎన్నికల ఫలితాల తరువాత అంతా అనుకునేవారు. కానీ చిత్రంగా ఇపుడు జగన్ ఆ పరిస్థితిని అనుభవిస్తున్నారు అంటే చేజేతులా చేసుకున్నదే అనుకోవాలిగా.

Tags:    

Similar News