జగన్ కు అది అసాధ్యమేనట

రోజులు గడిచే కొద్దీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఇబ్బందులు తప్పేట్లు లేవు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉన్నప్పటికీ ఏపీలో రాజకీయ వేడి అప్పుడే అలుముకుంది. జగన్ [more]

;

Update: 2021-08-07 02:00 GMT

రోజులు గడిచే కొద్దీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఇబ్బందులు తప్పేట్లు లేవు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉన్నప్పటికీ ఏపీలో రాజకీయ వేడి అప్పుడే అలుముకుంది. జగన్ తాను ఇచ్చిన హామీలను దాదాపు 90 శాతం నెరవేర్చారు. ఇవన్నీ ఆర్థికంగా ముడిపడటంతో అతి కష్టం మీద పథకాలను ప్రజల చెంతకు చేరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదని ఆర్థిక నిపుణులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు సయితం హెచ్చరిస్తున్నారు.

పాదయాత్రలో…..

అయితే జగన్ ముందు మరో సమస్య కాచుక్కూర్చుని ఉంది. మద్యనిషేధాన్ని అమలు పరుస్తానని జగన్ పదే పదే తన పాదయాత్రలో చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం అధీనంలోకి తెచ్చారు. ప్రయివేటు వ్యక్తుల జోక్యం లేకపోతే రేట్లు పెరగవని అనుకున్నా వంద, రెండు వందల శాతం రేట్లు పెంచిన జగన్ ప్రభుత్వం మద్యాన్ని మాన్పించడం కోసమే రేట్లు పెంచామని కలర్ ఇచ్చుకుంది.

దశలవారీగా…

ఇక బ్రాండ్ల విషయంలో జగన్ అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎక్కడా లేని బ్రాండ్లను ఏపీలోకి తెచ్చి బలవంతంగా విక్రయిస్తున్నారని, ఇవన్నీ జగన్ మద్దతుదారుల కంపెనీలో తయారైనవేనని టీడీపీ ఆరోపిస్తుంది. దీనికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. మద్యం నిషేధాన్ని దశల వారీగా అమలుపరుస్తానని ఇచ్చిన హామీ మాత్రం ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు.

నిషేధించకుంటే…?

ఎందుకంటే ఇప్పుడు మద్యం పైనే రాష్ట్ర ఆదాయం ఆధారపడి ఉంది. మద్యం ద్వారా వచ్చే ఆదాయం కూడా రాకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. కరోనా తో రెండేళ్లపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమయింది. ఇప్పుడప్పుడే ఇది గాడిన పడే పరిస్థితి లేదు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఢిల్లీ వెళ్లి అప్పుల కోసం వెసులబాటు కల్పించాలని పెద్దలను వేడుకోవడం మనకు కనిపిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో జగన్ మద్యనిషేధాన్ని అమలు చేయడం అసాధ్యమేనన్నది పార్టీ నేతల అభిప్రాయం కూడా.

Tags:    

Similar News