70 మందికి ఈసారి హుళక్కేనట
జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అవుతుంది. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది. ఈసారి ఎన్నికలు కూడా జగన్ కు ప్రతిష్టాత్మకమే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ వచ్చిన [more]
;
జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అవుతుంది. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది. ఈసారి ఎన్నికలు కూడా జగన్ కు ప్రతిష్టాత్మకమే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ వచ్చిన [more]
జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అవుతుంది. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది. ఈసారి ఎన్నికలు కూడా జగన్ కు ప్రతిష్టాత్మకమే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ వచ్చిన జగన్ ముప్ఫయేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని భావిస్తున్నారు. అందుకోసం ఖజానా వెక్కిరిస్తున్నా ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలను చెప్పినట్లు అమలు చేస్తున్నారు. ఎంత చేసినా ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. ప్రధానంగా తన కన్నా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత పార్టీ విజయం పై పడుతుంది.
పనితీరుపై….
అందుకే జగన్ ముందు జాగ్రత్తగా ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారట. తన సొంత మీడియా సంస్థ ద్వారా కూడా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారని చెబుతున్నారు. ఇందులో 70 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని తెలుస్తోంది. ప్రధానంగా పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లలేకపోవడం కూడా తెలిసింది.
అందుబాటులో లేకుండా….
మరోవైపు జగన్ తనకు నమ్మకమైన వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా ఎమ్మెల్యేల పనితీరుపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారట. అనేక మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో ఉండకుండా వ్యాపారాలకే పరిమితమయ్యారన్న రిపోర్టులు కూడా అందుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండని ఎమ్మెల్యేలు దాదాపు 30 మంది వరకూ ఉన్నట్లు జగన్ కు అందిన రిపోర్టులో తేలిందంటున్నారు.
సీటు దక్కకపోతే…?
వీరిలో ఈసారి చాలా మందికి టిక్కెట్లు తిరిగి దక్కే అవకాశం లేదు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి విజయం కోసం పనిచేస్తే వారికి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీయో, రాజ్యసభ ఇస్తారు. అలాగే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎక్కువగా పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలు కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఈసారి జగన్ 70 మంది సిట్టింగ్ చీటీలు చించేస్తారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. వారి పనితీరు మార్చుకోగలిగితే మరోసారి టిక్కెట్ దక్కించుకునే ఛాన్స్ ఉంది.