అడ్డంగా దొరికిపోయారా? సొంత గడ్డకూ చెడ్డేనా… ?

జగన్ అనుభవ రాహిత్యం అడుగడుగునా బయటపడుతోంది. దాంతో పాలనాపరంగా ఆయన తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. దాంతో ఆయన రాజకీయంగా కూడా దారుణంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది [more]

Update: 2021-07-24 02:00 GMT

జగన్ అనుభవ రాహిత్యం అడుగడుగునా బయటపడుతోంది. దాంతో పాలనాపరంగా ఆయన తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. దాంతో ఆయన రాజకీయంగా కూడా దారుణంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది అంటున్నారు. జగన్ మూడు రాజధానులు అన్నప్పుడే రాయలసీమలో కొంత అసంతృప్తి చెలరేగింది. ఇపుడు కృష్ణా జలాల పుణ్యామని మరింతగా ఆయన చెడ్డ అయ్యారు అంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథ‌కం సంగతి దేముడెరుగు కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన గెజిట్ పుణ్యామని ఏకంగా వైఎస్సార్ తెచ్చిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కూడా ఇపుడు అటకెక్కిందని సీమవాసులు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే ఈ పథ‌కానికి ఎలాంటి అనుమతులు లేవు. ఇప్పుడు వాటిని తెచ్చుకోవడం కూడా కష్టమే.

జగన్ ను టార్గెట్ గా….

అందుకే రాయలసీమ నాయకులు జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. కేంద్రం కొద్ది రోజుల ముందు గెజిట్ నోటుని విడుదల చేసింది. దాన్ని పూర్తిగా చదివారో లేదో తెలియదు కానీ జగన్ కుడి భుజం లాంటి సజ్జల రామక్రిష్ణా రెడ్డి ఉత్సహాంగా మీడియా ముందుకు వచ్చి గెజిట్ నోటిఫికేషన్ని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని ప్రకటించారు. నిజానికి కేంద్రం పెత్తనం, రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం తప్ప గెజిట్ నోటిఫికేషన్ లో ఏముందని అంతా నిలదీస్తున్నారు. నీటిపారుదల రంగానికి చెందిన నిపుణులు అయితే జగన్ దే తప్పు అని కూడా అంటున్నారు. ఎందుకంటే జగన్ కేసీఆర్ తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని పదే పదే లేఖలు రాశారు. అలా అడ్డంగా ఇపుడు జగన్ దొరికారు అంటున్నారు.

ప్రకాశం జిల్లాకు కూడా….

ఇక ఈ గెజిట్ నోటిఫికేషన్ పుణ్యమాని ప్రకాశం జిల్లా కూడా దారుణంగా నష్టపోతోంది. వెలుగొండ ప్రాజెక్టుకు కూడా అనుమతులు లేవు. దాంతో వారు కూడా జగన్ సర్కార్ మీద గుర్రుమీద ఉన్నారు. ఇపుడు గెజిట్ నోటిఫికేషన్ లోని వాస్తవాలు తెలుసుకుని నాలుక కరచుకున్నా చేసేది ఏమీ లేదు అంటున్నారు. ఎందుకంటే జగన్ కోరిందే కేంద్రం జోక్యం. ఇపుడు వారు అదే చేశారు. అందువల్ల జగన్ గట్టిగా ప్రయత్నం చేసినా ఫలితం ఎంతవరకూ ఉంటుంది అన్నదే పెద్ద డౌట్.

ఇగోకు పోయి….

మొత్తానికి కృష్ణా జలాల సమస్యను పట్టుదలకు, ఇగోకు పోయి పీకల మీద దాకా జగన్ తెచ్చుకున్నారు అంటున్నారు. మరో వైపు దక్షిణ తెలంగాణాను ఎండగట్టిన పాపం జగన్ దే అంటూ తెలంగాణా నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఒక్క జగన్ రెండు తెలుగు రాష్ట్రాలకు తన అనుభవ రాహిత్యంతో అన్యాయం చేశాడని అంతా అంటున్నారు.

Tags:    

Similar News