జగన్ జాబ్స్ రెడీ… విపక్షాలకు అలా చెక్.. ?

ఏపీలో ఇపుడు జాబ్ క్యాలండర్ మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. నిజానికి జగన్ కోరి మరీ అనువు కానీ వేళ జాబ్ క్యాలండర్ ప్రకటించి కొరివితో [more]

Update: 2021-08-08 05:00 GMT

ఏపీలో ఇపుడు జాబ్ క్యాలండర్ మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. నిజానికి జగన్ కోరి మరీ అనువు కానీ వేళ జాబ్ క్యాలండర్ ప్రకటించి కొరివితో తల గోక్కున్నారా అన్న చర్చ అయితే ఉంది. రెండేళ్ళుగా ఏపీకి ఎక్కడా ఆదాయం లేదు. కరోనా మింగిన వెలగపండుగా ఏపీ ఉంది. తేరుకునే దారీ తెన్నూ అసలు కనిపించడం లేదు. అలాంటి వేళ కొంతకాలం ఆగి అన్నీ చూసుకుని జాబ్ క్యాలండర్ విడుదల చేయాల్సింది అన్నది సొంత పార్టీ నేతల భావన కూడా. కానీ జగన్ ఒక్కసారి దూకుడు చేశారు. ఫలితంగా విపక్షాలకు చక్కని ఆయుధం దొరికింది.

మండుతుందిగా మరి…?

జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పిన మాట వేరు. రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని తాను వచ్చిన వెంటనే భర్తీ చేస్తాను అని పాదయాత్రలో ప్రతీ చోటీ జగన్ హామీ ఇచ్చుకుంటూ పోయారు. ఇపుడు అధికారంలోకి వచ్చాక ఆయన జాబ్స్ ఇవ్వలేదు. సరే వేచి చూద్దమాని నిరుద్యోగులు అనుకున్నారు. కానీ జగన్ జాబ్ క్యాలండర్ పేరిట కేవలం పదివేల ఉద్యోగాలనే చూపించారు. దాంతో వారికి ఒక్కసారిగా మండిపోయింది. జాబ్స్ అంటే కనీసంగా యాభై వేల దాకా అయినా ఉంటాయని ఊహించిన వారు వీరావేశమే ఎత్తారు. దాంతో యూత్ జగన్ కి యాంటీగా మారుతోంది అన్న భయం అధికార పార్టీలో కనిపిస్తోంది.

నక్కను తొక్కారా …?

జగన్ తాను చెప్పినట్లుగానే ఏపీలో నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఇందులో రెండున్నర లక్షల ఉద్యోగాలు వాలంటీర్లు. ఇవి జాబ్స్ కావని, గౌరవమైన వృత్తిగానే చూడాలని జగనే ఆ మధ్య చెప్పారు. వారికి సేవామిత్ర అవార్డులు కూడా ఇచ్చి జీతాలు పెంచలేదు, ఇపుడు వాటిని ఉద్యోగాలలో కలిపితే ఎవరూ ఊరుకోరు. అయితే మరో రెండు లక్షల దాకా సచివాలయాలలో పనిచేసే స్టాఫ్ ఉన్నారు. వీరంతా కన్సాలిడేటెడ్ వేతనంతో పనిచేస్తున్నారు. వారికి పదిహేను వేల రూపాయ‌లు దాకా నెలకు చెల్లిస్తున్నారు. ఇపుడు వీరిలో నాలుగవ వంతు మందికి ప్రోబేషన్ ఇచ్చి పర్మనెంట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందిట. దాంతో వీరు నక్కను తొక్కారు అంటున్నారు.

ఆందోళన ఆగుతుందా..?

వీరికి అర్జంటుగా పరీక్షలు నిరహిస్తున్నారు. వాటిలో పాస్ అయిన వారికే ప్రొబేషన్ అంటున్నారు. అలాగే వారి పనితీరు మీద నివేదికలు కూడా తీసుకుంటున్నారు. ఇలా అన్నీ సరిపోయిన వారిలో యాభై వేల మందికి ప్రొబేషన్ ఇచ్చి కొన్నాళ్ళ పాటు మరింత హెచ్చు జీతంతో పనిచేయించుకుంటారు. వారిని దశలవారీగా పర్మనెంట్ చేస్తామని చెబుతున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగమే అన్న మాట. ఒక విధంగా జగన్ తన మాట నిలబెట్టుకున్నారు అన్నడానికి ఈ ఉద్యోగాల పర్మనెంట్ ని చూపిస్తారు అంటున్నారు. సరే యాభై వేల మంది సర్కార్ ఉద్యోగులు అవుతారు కానీ బయట లక్షల్లో ఉన్న నిరుద్యోగులు వీరిని చూసి ఆగుతారా అంటే వారికి కూడా సచివాలయ ఉద్యోగాలలోనే అవకాశాలు ఇస్తారని అంటున్నారు. అంటే ఇకమీదట జాబ్స్ అంటే జగన్ మానసపుత్రిక అయిన సచివాలయాల్లోనేనా అన్న మాట వినిపిస్తోంది. అయితే జగన్ మాత్రం ఇస్తే తన బ్రెయిన్ చైల్డ్ సచివాలయాల్లోనే జాబ్స్ ఇవ్వాలి అన్నట్లుగా డెసిషన్ తీసుకున్నారు అంటున్నారు. చూడాలి మరి ఈ ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుందో ఏపీలోని నిరుద్యోగ యువత ఎలా శాంతిస్తారో.

Tags:    

Similar News