సీటు ఇస్తానంటే టీడీపీలోకి వస్తా.. వైసీపీ ఎమ్మెల్యే షరతు

జగన్ రాజకీయ నాయకుడు కంటే ముందు ఒక వ్యాపారవేత్త. ఆయన వ్యాపారాలన్నీ లాభాల్లోనే నడుస్తున్నాయి. బిజినెస్ మెన్ గా జగన్ సక్సెస్ అయ్యారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు [more]

;

Update: 2021-07-24 05:00 GMT

జగన్ రాజకీయ నాయకుడు కంటే ముందు ఒక వ్యాపారవేత్త. ఆయన వ్యాపారాలన్నీ లాభాల్లోనే నడుస్తున్నాయి. బిజినెస్ మెన్ గా జగన్ సక్సెస్ అయ్యారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం జగన్ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్లోకి వస్తే తమ చేతులు కట్టేశారని మదనపడుతున్నారు. తమ వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయని, ఆర్థికంగా ఇక కోలుకోలేమని కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇందులో భాగంగా ఒక ఎమ్మెల్యే టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తనకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని హామీ ఇస్తే టీడీపీ లోకి వస్తానని చెప్పినట్లు తెలిసింది.

రెండేళ్లవుతున్నా…

ఈ విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా చర్చనీయాంశమైంది. జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పైగానే అవుతుంది. అయితే ఎమ్మెల్యేలను పూచిక పుల్లతో సమానంగా చూస్తున్నారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే తీసుకోవడంతో దానిమీద ఆశ పెట్టుకున్న కొందరి ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురయింది. మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోకి వెళ్లడంతో అనుచరుల నుంచి కూడా ఎమ్మెల్యేలు అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు.

ఇసుక ఆదాయం…..

ఇక ఇసుక ద్వారా కొంత ఆదాయం ఎమ్మెల్యేలకు లభించేది. అయితే జగన్ దీనిని గంపగుత్తగా కంపెనీకి ఇవ్వడంతో ఇప్పుడు ఇసుక ఆదాయానికి కూడా గండి పడింది. దీంతో ఎమ్మెల్యేల ఆదాయం పూర్తిగా కట్ అయింది. గత ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినా సంపాదించుకోవచ్చన్న ఆశతో ఉన్న వారికి ఆదాయమార్గాలన్నీ మూసుకుపోయాయి. దీంతో జగన్ ఎవరినీ తినడివ్వడని అర్థమయింది. దీంతో పార్టీ పై అసంతృప్తితో ఉన్నారు.

వ్యాపారాలు దెబ్బతినడంతో…

అసంతృప్తి ఎంతవరకూ వెళ్లిందంటే.. గుంటూరు జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎంపీకి టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. తనకు వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఇస్తామంటే పార్టీలోకి రావడానికి రెడీ అన్న సంకేతాలు పంపినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటు పదవులు తమ వారికి ఇవ్వకుండా, ఆదాయ మార్గాలను జగన్ మూసివేయడంతో ఎమ్మెల్యేలు విలవిలలాడుతున్నారు. ఇదే అసహనం ముదిరితే ఎన్నికల నాటికి పూర్తిగా బరస్ట్ అయ్యే అవకాశముంది.

Tags:    

Similar News