జగన్ కి బీజేపీ దోవ చూపిస్తుందా… ?

జగన్ ఇప్పుడు విపరీతమైన టెన్షన్స్ లో ఉన్నారు. ఆయన కుటుంబ పెద్దగా ఉన్నారు. ఏపీలో అప్పుల భారాన్ని ఆయన ఒంటిచేత్తో మోస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ కూడా [more]

;

Update: 2021-07-24 12:30 GMT

జగన్ ఇప్పుడు విపరీతమైన టెన్షన్స్ లో ఉన్నారు. ఆయన కుటుంబ పెద్దగా ఉన్నారు. ఏపీలో అప్పుల భారాన్ని ఆయన ఒంటిచేత్తో మోస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి పడిన కరోనా విలయానికి విలవిలలాడుతూంటే ఏపీ పరిస్థితిని అసలు ఊహించతరమా. అయినా కూడా జగన్ పొదుపు చర్యలను ఎలా చేపట్టాలి అన్న దాని మీద కమిటీని వేశారు అంటున్నారు. ఆ నివేదికల మీద తదుపరి చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. సరే జగన్ ఇలా ఉంటే ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోందుకు ఏకంగా బీజేపీ నాయకత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని కనిపెట్టింది.

పొమ్మనకుండా …?

ప్రభుత్వ ఉద్యోగులు అంటే రిటైర్ అయ్యేంతవరకూ పోషించాల్సిందే. వారి విషయంలో రెండవ మాట లేదు. అలాంటిది ఇపుడు జీతాలు ఇచ్చేందుకు కటకటలాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. అందుకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పోలీస్, విద్య, వైద్యం, రెవెన్యూ విభాగాలు మినహా ఇతర అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఐదేళ్ల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సెలవు సమయంలో వారికి సగం జీతం ఇస్తారు. ఖర్చును తగ్గించుకునేందుకు ఇలా ఆర్థికశాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపితే వెంటనే అమల్లోకి వస్తుంది. తద్వారా ఏటా ఆరు వేల కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఒక విధంగా పొమ్మకనుండా ఉద్యోగులను ఇంటిపట్టునే ఉండమని చెప్పడం అన్న మాట.

ఏపీలో కూడా….

ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న జగన్ సర్కార్ కి ఈ విధంగా బీజేపీ ఒక దోవ చూపించింది అనుకోవాలేమో. మధ్యప్రదేశ్ లో కనుక దీన్ని అమలు చేస్తే ఏపీలో కూడా జగన్ హ్యాపీగా స్వీకరించవచ్చు. నిజానికి చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యేంతవరకూ చేసుకోవచ్చు కదా అని వస్తూంటారు. ఒక లెవెల్ దాకా ఉద్యోగం చేసేవారు కూడా ఉన్నారు. బాధ్యతలు తీరిన వారు అయితే ఇలాంటి ప్రతిపాదనలకు ఓకే అనే అవకాశం కూడా ఉంది. మరి ఇది కనుక ఏపీలో అమలు చేస్తే జగన్ సర్కార్ కి చాలా తలనొప్పులు తగ్గిపోతాయి అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News