ఈ పని చేస్తే జగన్‌కు ఫుల్లు డ్యామేజీనే…?
ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న ఏపీ సర్కారుకు కొందరు ఒక సలహా రువ్వారు. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రైమ్ నగరాల్లో అమల్లో ఉన్న [more]
;
ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న ఏపీ సర్కారుకు కొందరు ఒక సలహా రువ్వారు. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రైమ్ నగరాల్లో అమల్లో ఉన్న [more]
ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న ఏపీ సర్కారుకు కొందరు ఒక సలహా రువ్వారు. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రైమ్ నగరాల్లో అమల్లో ఉన్న విధంగా.. ఒక విధానాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేయాలనేది సదరు సలహాదారుల సూచన. దీనిని అమలు చేయడం ద్వారా.. ఏపీ సర్కారు ఆదాయం ఇప్పుడు వస్తున్న దానికి రెట్టింపు వస్తుందనేది వీరి సలహా. అయితే దీనిని లోతుగా పరిశీలిం చిన జగన్.. ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు. ఏంటనేది ఆయన తేల్చలేక పోయారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోతున్న నేపథ్యంలో వీరు చెప్పిన విధానానికి జై కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
అదే జరిగితే…?
అయితే.. ఇదే కనుక జరిగితే..రాష్ట్రంలో వైసీపీ ఇమేజ్ ఫుల్లుగా డ్యామేజీ అవుతుందని అంటున్నారు పరిశీ లకులు. ఇంతకీ ఆ అసలు సంగతి ఏంటంటే.. లిక్కర్ హోం డెలివరీ..! దీనిపై మూడు మాసాలుగా జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాస్తవానికి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో విడతల వారీగా మద్యాన్ని నిషేధిస్తానని.. జగన్ హామీఇ చ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ప్రచారం చేసుకున్నారు. మద్యం ధరలను సామాన్యులకు అందకుండా చేసి.. తాగకుండా చేస్తానని చెప్పారు. అనుకున్నట్టుగానే తొలి ఏడాది చేసినా.. రెండో ఏడాది వచ్చే సరికి.. మాత్రం ఆయన మద్యం దుకాణాల సంఖ్యను నిలువరించలేక పోయారు.
ఆదాయం లేక….
అంతేకాదు.. ఇప్పుడు కొత్తగా పర్యాటక ప్రాంతాల్లో 300 మద్యం దుకాణాలను సర్వహంగులతో తీర్చిదిద్దాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది. అంటే.. ఇప్పటికే ఉన్న..(తొలి ఏడాది 25 శాతం దుకాణాలు తగ్గించారు) వాటికి వీటిని అదనంగా చేర్చనున్నారు. అదే సమయంలో ఇప్పటికే మద్యం మాల్స్‌ను ప్రముఖ నగరాల్లో అందుబాటులోకి తెచ్చారు. అయితే.. ఇవి అనుకున్న విధంగా ఆదాయాన్ని ఇవ్వడం లేదు. మరోవైపు రాష్ట్రం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సరిపోవడం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది.
హోం డెలివరీ….
ఈ క్రమంలోనే ఒక సలహాదారు ఇంటింటికి మద్యం డెలివరీ విధానం అందుబాటులోకి తెస్తే.. ఆదాయం పెరుగుతుందని.. జగన్ కు సలహా ఇచ్చారు. కొన్నాళ్లు దీనిని పక్కన పెట్టిన జగన్ ప్రస్తుతం ఈ విషయంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అయితే.. దీనిని కనుక ఆయన లైన్‌లో పెడితే.. ప్రతిపక్షాలకు ఆయుధాలు అందించినట్టే అవుతుందని అంటున్నారు పరిశీలకులు. వైసీపీ ఇప్పటి వరకు సంపాయించుకున్న ఇమేజ్ కూడా దారుణంగా పడిపోతుందని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.