మళ్ళీ పాత జగన్ని చూస్తారట… ?
జగన్ అంటేనే ఓదార్పు. జగన్ అంటేనే సరికొత్త మార్పు. ఆయనే ఒక అద్భుతమైన తీర్పు. జగన్ నేరుగా ఇంటికి వచ్చి పలకరించే సాధారణ నాయకుడు. జగన్ అంటేనే [more]
;
జగన్ అంటేనే ఓదార్పు. జగన్ అంటేనే సరికొత్త మార్పు. ఆయనే ఒక అద్భుతమైన తీర్పు. జగన్ నేరుగా ఇంటికి వచ్చి పలకరించే సాధారణ నాయకుడు. జగన్ అంటేనే [more]
జగన్ అంటేనే ఓదార్పు. జగన్ అంటేనే సరికొత్త మార్పు. ఆయనే ఒక అద్భుతమైన తీర్పు. జగన్ నేరుగా ఇంటికి వచ్చి పలకరించే సాధారణ నాయకుడు. జగన్ అంటేనే తమ ఊరికి తానే స్వయంగా వచ్చి కష్టసుఖాలు తెలుసుకునే నేత. ఆయనకు మరో పేరే జననేత. అలాంటి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అసలు బయటకు రాలేదు. ఆయన రెండున్నరేళ్ళ పాలనకు దగ్గర పడుతున్న వేళ మళ్లీ జనంలోకి రాబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బంపర్ మెజారిటీతో గెలిచి తీరాలని జగన్ పట్టుదల మీద ఉన్నారు. దాంతో జగన్ ఇక మీదట ఏపీ అంతా కలియతిరిగేస్తారు అంటున్నారు వైసీపీ నేతలు.
ముఖ్యమంత్రి అలా …
ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చెప్పిన మాటను జగన్ నిలబెట్టుకున్నారు. అందరికీ సంక్షేమ పధకాలు అమలు చేశారు. ఇక మీదట అదే విధంగా తమ ఇంటికే ముఖ్యమంత్రి వచ్చాడు అని జనాలు షాక్ తినేలా జగన్ పర్యటనలు ఉంటాయట. జగన్ పల్లెలలో తిరిగి జనం బాగోగులను తనకు తానుగా తెలుసుకుంటారుట. అంతే కాదు పేదల ఇళ్ళలోకి వెళ్ళి వారితోనే ముచ్చట్లు పెడతారని అంటున్నారు. పేదల అరుగులే రచ్చబండలుగా చేసుకుని వారితో మమేకం అవుతారుట. ఒక విధంగా జగన్ ఇలా చేస్తే దేశంలోనే తొలి నాయకుడిగా రికార్డు సృష్టిస్తారు అనుకోవాలి.
అక్కడే అన్నీ…
అదే విధంగా జగన్ పల్లె నిద్ర కూడా చేస్తారుట. తాను ఎంచుకున్న గ్రామాలలో ఒక రోజు రాత్రి బస చేయడం ద్వారా అక్కడ సాధకబాధకాలను తెలుసుకుంటారని చెబుతున్నారు. జనమే తానుగా మారి జగన్ చేపట్టబోయే ఈ యాత్రలకు ఏం పేరు పెడతారో తెలియదు కానీ ఈ వినూత్న కాన్సెప్ట్ తో జగన్ ప్రజల మధ్యకు వస్తే మాత్రం విపక్షాలకు చుక్కలు కనిపించడం ఖాయమే అంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు జనంలోకి పెద్దగా పోలేదు. కరోనా రెండు దశల మూలంగా ఎక్కడి వారు అక్కడే అన్నట్లుగా ఉన్నారు. దాంతో జగనే మళ్ళీ ప్రజా బాట పట్టనున్నారు. అందరి కంటే ముందుగానే తాను జనాలను కలవబోతున్నారు అంటున్నారు.
అదే వ్యూహం ….
రాష్ట్రం ఇబ్బందులలో ఉన్నా కూడా తాను అనేక పధకాలు అమలు చేశానని జగన్ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అదే సమయంలో తన పాలనలో జరిగిన మేళ్ళను కూడా ఆయన వల్లె వేస్తారు. మరో వైపు తన మానస పుత్రికలు అయిన సచివాలయాల పనితీరు ని కూడా తెలుసుకుంటారు. ఈ పర్యటనలో విపక్షాల దూకుడుకు అడ్డుకట్ట వేయడమే కాకుండా స్వపక్షంలో నిద్ర మత్తులో ఉన్న వారి చిట్టాను కూడా బయటకు తీయాలని జగన్ తలపోస్తున్నారుట. అలాగే సరిగ్గా స్పందించని అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి జగన్ కనుక జనంలోకి వస్తే అది ఏపీ రాజకీయ చరిత్రలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టడమే అంటున్నారు.