జగన్ గ్రాఫ్ ఇక అప్పుడే పెరుగుతుందట
కేవలం ఒకే ఒక్క ఏడాది. అంటే పన్నెండు నెలలు. ఒక క్యాలండర్ అలా గిర్రున తిరిగింది. అంతే జగన్ ప్లేస్ నాలుగు నుంచి పదహారుకు పడిపోయింది. అంటే [more]
;
కేవలం ఒకే ఒక్క ఏడాది. అంటే పన్నెండు నెలలు. ఒక క్యాలండర్ అలా గిర్రున తిరిగింది. అంతే జగన్ ప్లేస్ నాలుగు నుంచి పదహారుకు పడిపోయింది. అంటే [more]
కేవలం ఒకే ఒక్క ఏడాది. అంటే పన్నెండు నెలలు. ఒక క్యాలండర్ అలా గిర్రున తిరిగింది. అంతే జగన్ ప్లేస్ నాలుగు నుంచి పదహారుకు పడిపోయింది. అంటే నాలుగు రెట్లు గా దిజగారింది అన్న మాట. ఇది నిజంగా వైసీపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేసే అంశమే. జగన్ అంటే ప్రజాదరణకు మారు పేరు అని చెప్పుకుని పొంగిపోతారు. ఇక ఏ సర్వే చేసినా వైసీపీకి ఆదరణ చెక్కుచెదరలేదనే ఇంతవరకూ చెప్పుకొచ్చాయి. ఇండియా టు డే ప్రతీ ఏటా చేసే మూడ్ ఆఫ్ ద నేషన్ లోనూ జగన్ రెండేళ్ళుగా పై చేయి సాధిస్తూనే ఉన్నారు. గత ఏడాది అయితే దేశంలోని అత్యుత్తమ ముఖ్యమంత్రులలో ఆయనది నాలుగవ స్థానం. కానీ ఈసారి అది పదహారవ ర్యాంక్ కి పడిపోయింది.
అన్నీ గెలిచి కూడా …
చివరి సారిగా ప్రజాభిప్రాయం ఇదే ఏడాది ఏప్రిల్ లో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ద్వారా బయటపడింది. అంటే ఇప్పటికి గట్టిగా నాలుగు నెలలు. ఆ ఎన్నికలోనూ గత మెజారిటీని పెంచుకుని మరీ వైసీపీ విజయ ఢంకా మోగించింది. దాని కంటే ముందు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ బోర విడుచుకుని మరీ ఏకపక్ష విజయాలను నమోదు చేసింది. అలాంటి వైసీపీకి పాపులారిటీ తగ్గిందా. జగన్ ఇమేజ్ బాగా తగ్గిందా. వినడానికి ఇది ఆశ్చర్యమే. నిజానికి ఈ సర్వే విపక్షానికి కూడా మింగుడుపడడంలేదులా ఉందిట. జగన్ బలమైన నాయకుడు, ఆయన్ని ఓడించడం కష్టమని అనుకుంటున్న వేళ పాపులారిటీ తగ్గిందని రావడం నిజనేమా అని ప్రతిపక్షాలు సయితం ఆలోచనలో పడ్డాయి.
అసలు ఎందుకిలా….?
జగన్ అన్నీ సమకూరుస్తున్నారు. సంక్షేమ పధకాలను కూడా పంటి బిగువున ఆయన అమలు చేస్తున్నారు. అప్పులు కుప్పలు తెప్పలుగా తెచ్చి మరీ నగదు బదిలీని చేస్తున్నారు. తాను ఇలా ప్రజలకు చెప్పిన మాట ప్రకారం చేస్తున్నారు. ఇక తనకు ఎదురేముంది అని జగన్ భావిస్తూ ఉండవచ్చు. కానీ సంక్షేమం ఒక్కటే సరిపోదు అని తాజా సర్వే ఫలితాలు నిరూపించాయనుకోవాలి. దాని కంటే కూడా చాలా అంశాలు ప్రభావితం చేస్తాయని జగన్ ఇపుడైనా గ్రహించాలని అంటున్నారు. ఈ మధ్య ఒక ఆత్మ సాక్షి పేరు మీద ఒక సర్వే జరిగింది. అందులో కూడా వైసీపీకి ఎదురుగాలి అని వచ్చింది. ఇపుడు దాన్ని నిజం చేసేలా ఇండియా టు డే సర్వే ఉందని అంటున్నారు.
తప్పులు దిద్దుకోవాలి…
ఏపీలో అభివృద్ధి లేదు. దాని కంటే ముందు ఇసుక కూడా బంగారం అయిపోయింది. అంతే కాదు, మద్యం విషయంలో ఎన్ని రకాలుగా అపఖ్యాతి పాలు కావాలో అన్నీ అయింది వైసీపీ సర్కార్. మరో వైపు చూస్తే ఏపీలో ఉద్యోగులు సంతృప్తిగా లేరు అన్న మాట ఉంది. నిరుద్యోగులు అయితే జాబ్ లెస్ క్యాలండర్ అంటూ ఈ మధ్యనే గోల పెట్టారు. వీరే కాదు అభివృద్ధి లేమి మాటున చాలా రంగాలకు చెందిన వారు దిగాలు పడ్డారు. వారంతా కూడా సంక్షేమం కిందకు వస్తారో రారో తెలియదు కానీ జగన్ సర్కార్ బాలేదని పెదవి విరుస్తున్నారు. ఇపుడు ఈ వర్గాలను దగ్గర తీయడం త్వరగా చేయాలి. అంతే కాదు, కొన్ని ప్రజా వ్యతిరేకమైన పాలసీలకు స్వస్తి చెప్పాలి. జగన్ తన కంటితో చూసి తన మనసుతో ఆలోచించి ఇక మీదట నిర్ణయాలు తీసుకోవాలి. అలా చేయాలంటే ఆయన అడుగు తీసి బయట పెట్టాలి. అపుడే జగన్ గ్రాఫ్ పెరుగుతుంది. ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉన్నందువల్ల తప్పులు దిద్దుకుంటే మళ్ళీ వైసీపీకి చాన్స్ ఉంటుంది. లేకపోతే మాత్రం వచ్చే ఏడాది ర్యాంక్ కూడా ఇపుడే చెప్పేయవచ్చు.