రెండుగా చీలిపోయారా?… జగన్ సర్కార్‌కు కొత్త సంకటం
జగన్ ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పులు ఎదురయ్యాయని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఏ ప్రభుత్వానికై నా.. పాలనే అత్యంత కీలకం. పాలన అంటే.. ప్రభుత్వం ఏం చేసినా.. [more]
;
జగన్ ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పులు ఎదురయ్యాయని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఏ ప్రభుత్వానికై నా.. పాలనే అత్యంత కీలకం. పాలన అంటే.. ప్రభుత్వం ఏం చేసినా.. [more]
జగన్ ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పులు ఎదురయ్యాయని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఏ ప్రభుత్వానికై నా.. పాలనే అత్యంత కీలకం. పాలన అంటే.. ప్రభుత్వం ఏం చేసినా.. దానిని ప్రజలకు అందించడం అధికారుల బాధ్యత. అదే సమయంలో ప్రభుత్వం సరిగా పనిచేసేలా ఎప్పటికప్పుడు.. వ్యూహాలు అందించడం కూడా వీరి విధి. అధికారులపై ఏ నాయకుడికి అయినా, ప్రభుత్వాధినేతకు అయినా గ్రిప్ ఉండాలి. అయితే.. ఇప్పుడు జగన్ సర్కారులో పనిచేస్తున్న ఉన్నతాధికారులు రెండు వర్గాలుగా చీలిపోయారనే చర్చలు వినవస్తున్నాయి. నిజానికి ఈ వాదన.. కొన్నాళ్లుగా ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో మరింత పెరిగిపోయింది.
ముందుగానే విపక్షాలకు…
తన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ముందుగానే ప్రతిపక్షాలకు చేరవేస్తున్నారనే విమర్శలు రావడంతోపాటు.. కొందరు అత్యంత రహస్య కార్యక్రమాలను కూడా ఓ వర్గం మీడియాకు చేరవేస్తున్నారనే విషయంపై సీఎం జగన్ సీరియస్‌గానే ఉన్నారు. ఈక్రమంలోనే చాలా మంది అధికారులను ఆయన ట్రాన్స్‌ఫర్ చేశారు. ఉన్నవారిలోనూ అత్యంత నమ్మకస్తులనే ఆయన తన దగ్గర పెట్టుకున్నారు. అయిన ప్పటికీ.. ప్రభుత్వ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించిన విషయాలు.. అంత్యంత రహస్యంగా చేస్తున్న పనులను కూడా కొందరు లీక్ చేస్తున్నారు.
విభాగాలు మారినా….?
ఈ పరిణామాలతో జగన్ ప్రభుత్వం ఇరుకున పడుతోంది. ఇది ప్రభుత్వ పరువును గంగ పాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు అసలు.. అధికారుల తీరుతెన్నులు కాకుండా.. వారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తేల్చాలని.. ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న అధికారుల్లో టీడీపీ హయాం నుంచిఒకే శాఖలో పనిచేస్తున్న వారిని చాలా మంది వరకు మార్చారు. అయినప్పటికీ.. వారు విభాగాలు మారినా.. వారికి ఉన్నపరిచయాలతో సదరు శాఖల పనితీరును తెలుసుకుంటున్నారట.
లూప్ లైన్ లో పెట్టేందుకు…?
ఈ క్రమంలోనే అననుకూల మీడియాకు ఉప్పందిస్తున్నారని.. రిపోర్టులు జగన్‌కు చేరాయి. దీంతో ఇలాంటి వారిని లూప్‌లైనో పెట్టాలని.. భావిస్తున్నారు.అదే సమయంలో కొందరు అధికారులను డిప్యుటేషన్‌పై కేంద్రానికి పంపేయాలని.. ఇంకొందరిని వాలంటరీ రిటైర్మెంట్ దిశగా నడిపించాలని భావిస్తున్నారు. మరి ఈ పరిణామం.. ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.