అందివచ్చినా… చంద్రబాబు వాడుకోలేకపోయారా?
జగన్ సర్కారుపై అవకాశం చిక్కినప్పుడల్లా.. విరుచుకుపడే టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేక పోయారనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఏపీ సీఎం జగన్ విషయంలో [more]
జగన్ సర్కారుపై అవకాశం చిక్కినప్పుడల్లా.. విరుచుకుపడే టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేక పోయారనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఏపీ సీఎం జగన్ విషయంలో [more]
జగన్ సర్కారుపై అవకాశం చిక్కినప్పుడల్లా.. విరుచుకుపడే టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేక పోయారనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఏపీ సీఎం జగన్ విషయంలో ఒక చిత్రమైన ఘటన జరిగింది. ఆయనకు ఉన్న ప్రజాభిమానం తగ్గిపోయిందని.. గత ఏడాది ఉత్తమ ముఖ్య మంత్రిగా దేశంలో 4వ స్థానంలో ఉన్న జగన్.. పరిస్థితి ఇప్పుడు ఏకంగా 16వ స్థానానికి పడిపోయిందని ఓ ప్రముఖ జాతీయ మీడియా సర్వే స్పష్టం చేసింది. ఇది నిజానికి జగన్‌కు తీవ్ర ఇబ్బందికర పరిణామమే. దీనిని తట్టుకుని.. వచ్చే ఏడాది నాటికి జగన్ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఆయన ఎందుకు ? ఇంతగా తన ప్రభావం కోల్పోయారనే విషయంపైనా దృష్టి పెట్టాలి. జగన్ క్రేజ్ ఎందుకు తగ్గిందనే దానిపై ఇప్పటికే రకరకాల విశ్లేషణలు కూడా మొదలైపోయాయి.
సంక్షేమ పథకాలు…..
నిజానికి జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు.. అమలు చేస్తున్న సంక్షేమం వంటివి ఇతర రాష్ట్రాల్లోనూ లేవని అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఎక్కడా లేని.. విధంగా ప్రజలకు వేలకు వేల రూపాయలను లబ్ధి దారుల అకౌంట్లలో వేస్తున్నారు. మరి ఇంత చేస్తున్నా.. జగన్ గ్రాఫ్ గత ఏడాదికి ఇప్పటికి ఎందుకు ? దిగజారిందనేది ప్రశ్న. ఇదిలావుంటే.. జగన్‌పై నిత్యం విమర్శలు చేసే చంద్రబాబుకు ప్రస్తుతం వచ్చిన ఈ అవకాశం ఎందుకు కనిపించలేదనేది ప్రశ్న. ఎందుకంటే.. చంద్రబాబు కోరుకున్నది ఇదే. జగన్ గ్రాఫ్ పడిపోవాలి.. తన అవసరం ప్రజలకు తెలియాలి. ఇదే చంద్రబాబు కోరుకున్నారు.
అందిపుచ్చుకోలేకపోయారా?
ఇప్పుడు సీఎంగా జగన్ గ్రాఫ్ పడిపోవడం.. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే అంచనాల నేపథ్యంలో చంద్రబాబు దీనిని అందిపుచ్చుకుని జగన్‌పై విమర్శల పర్వం పెంచుతారని అందరూ అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా చంద్రబాబు మాత్రం.. ఈ విషయాన్ని పట్టించుకోలేదు.అసలు దీనిపై కామెంట్లుకూడా పెద్దగా చేయలేదు. అయితే కొన్ని మీడియా సంస్థలు మాత్రం జనం మెచ్చడం లేదంటూ.. జగన్‌పై విమర్శలతో కథనాలు వండి వార్చేశారు. పోనీ .. వీటిని కూడా టీడీపీ పట్టించుకున్నట్లు లేదు. ఈ క్రమంలో ఒక విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.
జగన్ ను విమర్శిస్తే…?
ఇప్పుడు జగన్‌ను విమర్శిస్తే.. ఇదేసమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి విషయం కూడా ప్రస్తావనకు తీసుకురావాల్సి ఉంటుందని.. తొలి పది మంది ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ కూడా లేరని.. సో.. జగన్‌ను విమర్శించి కేసీఆర్‌ను పక్కన పెడితే.. టీడీపీని కార్నర్ చేస్తూ.. వైసీపీ కూడా విమర్శలు చేసే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావించి ఉంటారని అంటున్నారు. ఈ పరిణామాలతోనే చంద్రబాబు ఫుల్‌గా సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఏదేమైనా.. ఒక మంచి ఛాన్స్ మాత్రం చంద్రబాబు మిస్ చేసుకున్నారని మాత్రం చెబుతున్నారు.